News September 28, 2024
మిడిల్ ఈస్ట్‌లో అతను తిరుగులేని శక్తి

ఇజ్రాయెల్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిన హెజ్బొల్లా చీఫ్ <<14217449>>నస్రుల్లా<<>> Middle Eastలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. 16 ఏళ్ల వయసులో అప్పటి చీఫ్ అబ్బాస్ అల్-ముసావి దృష్టిని ఆకర్షించాడు నస్రుల్లా. 1992లో ముసావి మరణానంతరం హెజ్బొల్లాకు నాయకత్వం వహించాడు. ఎవరూ ఊహించని రీతిలో దాన్ని పటిష్ఠ పరిచాడు. 1997లో ఇజ్రాయెల్ బలగాల చేతిలో కుమారుడిని కోల్పోయిన నస్రుల్లా హెజ్బొల్లాను సాయుధ, రాజకీయ శక్తిగా మలిచాడు.
Similar News
News March 10, 2026
PCOSతో దంత సమస్యలు

పీసీఓఎస్ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్‌టైటిస్’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయంటున్నారు నిపుణులు. PCOS వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చిగుళ్లలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో దంత సమస్యలు దాడి చేస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదిస్తే తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు సూచిస్తారని చెబుతున్నారు.
News March 10, 2026
కాకి ఇంటి ముందుకు వస్తే శుభమా? అశుభమా?

జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుని వాహనం కాకి. దాన్ని ‘కాలజ్ఞాని’గా భావిస్తారు. ఇంటి ముందు కాకి అరిస్తే అతిథులు వస్తారని నమ్మకం. అయితే అది వింత స్వరంతో అరిచినా, గుంపు వచ్చి వాలినా ఆపదలకు సంకేతమని జ్యోతిషులు చెబుతున్నారు. ఇక కాకి ఇంటి లోపలికి రావడం అయితే తీవ్ర అశుభమని అంటున్నారు. ఇది ఏదైనా చెడు వార్తను లేదా పెద్ద విపత్తును సూచిస్తుందట. అయితే ఇవన్నీ విశ్వాసాలే తప్ప శాస్త్రీయ ఆధారం లేదని గమనించాలి.
News March 10, 2026
HEC విద్యార్థులకు ఏయే కోర్సులున్నాయంటే?

<<19336321>>ఇంటర్‌లో<<>> HEC పూర్తిచేసిన వారికి విభిన్నమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారు B.Aలో HEP. లిటరేచర్ B.A లాంగ్వేజెస్. జర్నలిస్టు అవ్వాలంటే B.A జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్. న్యాయవాది కావాలనుకుంటే ఐదేళ్ల BA LLB కోర్సు. టీచర్ అయ్యేవారికి B.A B.Ed. కంప్యూటర్స్ అంటే మక్కువ ఉంటే BCA కూడా బాగుంటుంది. ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్ వైపు కూడా వెళ్లొచ్చు.


