News January 23, 2025
రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి ఈయనే..

2025 గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇండోనేషియాకు చెందిన 160మందితో కూడిన కవాతు, 190 మంది సభ్యుల బ్యాండ్ బృందాలు భారత సైనికులతో కలిసి కవాతు నిర్వహించనున్నాయి. 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను వేడుకలకు ఆహ్వానిస్తోంది. గతేడాది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ హాజరైన విషయం తెలిసిందే.
Similar News
News January 29, 2026
మున్సిపల్ ఛైర్మన్ పోస్టు ఖరీదు రూ.3కోట్లు?

TG: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల కన్నా ముందే ఛైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. MLAలు, సీనియర్ నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఎన్నికలలో పార్టీ ఖర్చులను పూర్తిగా భరిస్తామని, ఛైర్మన్ పదవిని తమకే ఇవ్వాలని విన్నవిస్తున్నారు. రూ.3 కోట్ల వరకు చెల్లించడానికి కూడా రెడీ అవుతున్నారు. కొన్ని చోట్ల ఆమేరకు ఒప్పందాలూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో FEB 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.
News January 29, 2026
మేడారం జాతర.. రేపు మరో జిల్లాలో సెలవు

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా రేపు మహబూబాబాద్ జిల్లాలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ములుగు జిల్లాలోనూ రేపు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రవ్యాప్తంగా సెలవు ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్‌తో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
News January 29, 2026
జంక్ ఫుడ్‌పై ఆ సమయంలో ప్రచారం వద్దు: ఆర్థిక సర్వే

జంక్ ఫుడ్‌పై కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచనలు చేసింది. ఉ.6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ యాడ్స్‌పై నిషేధం విధించాలని చెప్పింది. చిన్నారుల పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌పైనా ఆంక్షలు విధించాలని పేర్కొంది. గత 14 ఏళ్లలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అమ్మకాలు 150 శాతం పెరిగాయని తెలిపింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు(HFSS) కలిగిన ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై హెచ్చరికలు ఉండాలని సూచించింది.


