News March 28, 2024
ఇతడు 200 మంది పిల్లలకు తండ్రి

బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస పటా సెకా 200 మంది పిల్లలకు తండ్రయ్యాడు. ఏడడుగులు, కండలు తిరిగిన దేహంతో ఆజానుబాహుడిగా ఉండేవాడు. 19వ శతాబ్దంలో బానిసల యజమానులు అతడిని బానిసగా మార్చి నల్లజాతి యువతులు, మహిళలతో సంపర్కం చేయించేవారు. అలా పలువురు యువతులు, మహిళలకు 200 మందికిపైగా పిల్లలు పుట్టారు. అతడి వల్ల జన్మించే బిడ్డలను 11 ఏళ్లకే కష్టమైన పనులకు ఉపయోగించుకునేవారు. సెకా 130 ఏళ్లు బతికినట్లు సమాచారం.
Similar News
News January 7, 2026
NPCILలో 114 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL) 114 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్, X-RAY టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు JAN 15 నుంచి ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.npcilcareers.co.in
News January 7, 2026
విద్యార్థి వీసాలపై అమెరికా తీవ్ర హెచ్చరికలు

విద్యార్థి వీసాలపై ఇండియాలోని అమెరికా ఎంబసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘స్టూడెంట్ వీసాదారులు US చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. చట్టాలను ఉల్లంఘించారని తేలినా, అరెస్టయినా వీసా రద్దవుతుంది. US నుంచి బహిష్కరిస్తారు. భవిష్యత్తులో వీసాలకు మీరు అనర్హులుగా మారవచ్చు. రూల్స్ పాటించండి. మీ ట్రావెల్ను ప్రమాదంలో పడేయకండి. US వీసా ఒక ప్రత్యేక ప్రయోజనం.. హక్కు కాదు’ అని ట్వీట్ చేసింది.
News January 7, 2026
సంక్రాంతి.. స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు

TG: సంక్రాంతికి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచినట్లు TGSRTC ప్రకటించింది. 2003లో ఇచ్చిన జీవో ప్రకారం టికెట్ ధరపై 1.5 రెట్ల వరకు సవరించామని పేర్కొంది. దీంతో రూ.100 ఉన్న టికెట్ రూ.150 కానుంది. TGతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకే ఇది వర్తించనుంది. ఈ నెల 9, 10, 12,13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే పెరిగిన ఛార్జీలు అమల్లో ఉంటాయని RTC వివరించింది.


