News April 30, 2024

‘భారత చలన చిత్ర పితామహుడు’ ఈయనే..

image

మొదటి భారతీయ చలన చిత్రం ‘రాజా హరిశ్చంద’ దర్శకుడే దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. భారతీయ సినీ పితామహుడిగా పేరొందారు. ఇవాళ ఆయన జయంతి. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. సినీరంగంలో చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం అందజేస్తోంది. లంకా దహన్, మోహిని భస్మాసుర్, గంగావతారం, బుద్ధాదేవ్ వంటి చిత్రాలను ఫాల్కే తెరకెక్కించారు.

Similar News

News November 21, 2025

MNCL: ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి: డి.భాగ్యవతి

image

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ రూ.4వేలు అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి డి.భాగ్యవతి తెలిపారు. మండల, జిల్లా, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు 2025 – 26 ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ కోసం డిసెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 21, 2025

పైరసీ కట్టడికి ప్రత్యేక వింగ్?

image

TG: సినిమాల పైరసీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇదే సమయంలో దానిపై ఉక్కుపాదం మోపేందుకు ఓ ప్రత్యేక వింగ్ పెట్టాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాల కట్టడికి ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు వివరించాయి. ఐ బొమ్మ రవి అరెస్టును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్న విషయం తెలిసిందే.

News November 21, 2025

నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

image

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్‌ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం