News November 4, 2024
రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ అతడే: కైఫ్

రోహిత్ శర్మ తర్వాత టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత జట్టులో కేవలం రిషభ్ పంత్ మాత్రమే అందుకు గట్టి పోటీదారు. కెప్టెన్సీకి అతడు న్యాయం చేయగలడు. అతడు ఏ స్థానంలో వచ్చినా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు న్యూజిలాండ్ భయపడింది’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News October 17, 2025
బంపరాఫర్.. రూ.11కే 2TB వరకు స్టోరేజ్

దీపావళికి గూగుల్ 1 స్టోరేజీకి సంబంధించి స్పెషల్ ఆఫర్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం లైట్(30GB రూ.30), బేసిక్(100GB రూ.130), స్టాండర్డ్(200GB రూ.210), ప్రీమియం(2TB రూ.650) ఉన్న ఈ ప్లాన్స్‌ను నెలకు రూ.11కే అందిస్తోంది. వీటితో జీమెయిల్, గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్‌లో ఎక్స్‌ట్రా స్టోరేజ్ పొందొచ్చు. ఈ ధరలు 3 నెలలు మాత్రమేనని, ఆఫర్ OCT 31 వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. తర్వాత సాధారణ ధరలు వర్తిస్తాయి.
News October 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 38

1. సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు విరిచిన శివధనస్సు పేరేంటి?
2. మహాభారత యుద్ధంలో శకునిని చంపింది ఎవరు?
3. మహాశివరాత్రి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
4. త్రింశత్ అంటే ఎంత?
5. శివాలయాలలో గర్భగుడి నుంచి అభిషేక జలం బయటకు వెళ్లే ద్వారాన్ని ఏమని అంటారు?
– సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 17, 2025
అమెరికాకు తగ్గిన ఎక్స్‌పోర్ట్స్

టారిఫ్‌ల పెంపుతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గాయి. సెప్టెంబర్ నెలలో ఎక్స్‌పోర్ట్స్ 546కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఇదే గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే 11.7% తక్కువ. ఈ ఏడాది ఆగస్టుతో పోల్చినా 17.9% మేర తగ్గాయి. మరోవైపు దిగుమతులు 398కోట్ల డాలర్లు(11.78%) పెరిగాయి. ఆగస్టు 27 నుంచి భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా 50శాతం టారిఫ్స్ విధిస్తోన్న విషయం తెలిసిందే.