News July 28, 2024

ఒంటరవుతుందేమోనని అమ్మను చంపేశాడు

image

TG: భద్రాద్రి కొత్తగూడెం(D) బూడిదగడ్డలో తుల్జాకుమారి పాసి(55) కుమారుడు వినయ్(27)తో ఉంటున్నారు. 10ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించారు. రెండేళ్లుగా తల్లికి ఆరోగ్యం బాగుండటం లేదు. ఆర్థిక సమస్యలతో వినయ్ మానసికంగా కుంగిపోయాడు. ఇటీవల అతడికీ ఓ జబ్బు వచ్చింది. ‘నాకు బతకాలని లేదు. నేను లేకపోతే అమ్మకు తోడెవరు?’ అని తనలో తాను మాట్లాడుకునేవాడు. ఈక్రమంలోనే శనివారం అర్ధరాత్రి తల్లిని హత్య చేసి, తాను ఉరేసుకున్నాడు.

Similar News

News September 19, 2025

ఆ ఒక్క టెస్టుతో రెండు జబ్బులూ గుర్తించొచ్చు..

image

బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణకు చేసే మామోగ్రామ్ టెస్టు ఆధారంగా మహిళల్లో గుండె జబ్బుల ముప్పును గుర్తించే ఏఐ పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆస్ట్రేలియాలో 49వేల మందికి పైగా మహిళల మామోగ్రామ్, మరణ రికార్డులను ఉపయోగించి దీనికి శిక్షణ ఇచ్చారని ‘హార్ట్‌’ వైద్య పత్రికలో ప్రచురించారు. ఈ టూల్‌‌తో రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదాన్ని గుర్తించొచ్చని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ జెన్నిఫర్‌ తెలిపారు.

News September 19, 2025

రోజూ వాల్‌నట్స్ తింటే ఇన్ని ప్రయోజనాలా?

image

* మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి
* బరువును నియంత్రిస్తాయి
* గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి
* సంతాన సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతాయి
* ఎముకలను బలోపేతం చేస్తాయి
* క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి
* షుగర్ రాకుండా కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు.
Share It

News September 19, 2025

కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే లేరు: కేటీఆర్

image

TG: వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ BRS కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి గానీ, ముస్లిం ఎమ్మెల్యే గానీ, ముస్లిం ఎమ్మెల్సీ గానీ లేరని వ్యాఖ్యానించారు.