News October 5, 2024

ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు.. కారణం అదే!

image

యూపీలోని అమేథీలో గురువారం ఇద్దరు పిల్లలు సహా దంపతులను హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. నిందితుడు చందన్ వర్మ.. సునీల్ కుమార్ (35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు అతడి భార్య పూనం (32), ఇద్దరు చిన్న పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం సూసైడ్ చేసుకునేందుకు యత్నించగా మిస్ ఫైర్ అయి బతికిపోయాడు. చందన్, పూనం మధ్య వివాహేతర సంబంధం ఉందని, విభేదాలతో ఆమె కేసు పెట్టడమే దీనికి కారణమని పోలీసులు గుర్తించారు.

Similar News

News October 5, 2024

అత్యంత అరుదైన ఖగోళ దృశ్యం.. మళ్లీ 80వేల ఏళ్ల తర్వాతే!

image

మరికొన్ని రోజుల్లో ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సుచిన్‌షాన్-అట్లాస్ అనే తోకచుక్క భూమికి 44 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుందని నాసా వెల్లడించింది. 2023లో సూర్యుడికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు దీన్ని తొలిసారి గుర్తించామని పేర్కొంది. ఈ నెల 9-10 తేదీల మధ్య స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని వివరించింది. ఈ తోకచుక్క భూమి సమీపానికి మళ్లీ వచ్చేది మరో 80వేల సంవత్సరాల తర్వాతే!

News October 5, 2024

హర్షసాయి‌పై లుక్‌అవుట్ నోటీసులు

image

TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 5, 2024

రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?

image

ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్ట్‌కు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఈ విధానాన్ని YCP ప్రభుత్వం తొలిసారి ఏపీలో తీసుకొచ్చింది. దాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది.