News February 15, 2025
కూతురిని ప్రేమించాడని..

TG: సంగారెడ్డిలో మెగ్యానాయక్ తండాలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న తన కుమార్తెను ప్రేమించాడనే నెపంతో దశరథ్ అనే వ్యక్తిని గోపాల్ హతమార్చాడు. అనంతరం నారాయణఖేడ్ పీఎస్‌లో లొంగిపోయారు. మరోవైపు దశరథ్కు అప్పటికే పెళ్లవ్వగా.. 4 రోజులుగా కనిపించకుండా పోయాడని భార్య ఫిర్యాదు చేసింది. తాజాగా హత్యకు గురైనట్లు తేలడంతో మృతదేహం కోసం గాలిస్తున్నారు.
Similar News
News December 6, 2025
గవర్నర్‌కు గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానం

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావలసిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈమేరకు లోక్ భవన్లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. CS రామకృష్ణారావు పాల్గొన్నారు. మరోవైపు మంత్రి అడ్లూరి హిమాచల్‌ప్రదేశ్, హరియాణా CMలు సుఖ్వీందర్ సింగ్ సుఖు, నాయబ్ సింగ్ సైనీలను కలిసి సమ్మిట్‌కు ఆహ్వానించారు.
News December 6, 2025
భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టులో ఓపెనర్ డీకాక్ సెంచరీ(106)తో అదరగొట్టారు. కెప్టెన్ బవుమా 48, బ్రెవిస్ 29, బ్రీట్జ్కే 24 రన్స్‌తో రాణించగా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్, ప్రసిద్ధ్ చెరో 4 వికెట్లతో చెలరేగారు. అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. భారత్ విజయానికి 271 రన్స్ అవసరం.
News December 6, 2025
రీఫండ్ సరే.. మిస్ అయిన వాటి సంగతేంటి?

తల్లి మరణించినా వెళ్లలేని దుస్థితి.. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మిస్సైన టీమ్.. విదేశాల్లో జాబ్‌కు వెళ్తూ నిలిచిపోయిన యువకులు.. ప్రయాణాలు వాయిదా పడడంతో నష్టపోయిన కుటుంబాలు.. ఎయిర్‌పోర్టుల్లో వెయిట్ చేసి అనారోగ్యం బారినపడ్డ వృద్ధులు.. ఇలా ఎయిర్‌పోర్ట్‌ల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తున్న ఇండిగో తాము కోల్పోయిన వాటిని తీసుకురాగలదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.


