News March 23, 2024

అతడు నాతో అనుచితంగా ప్రవర్తించాడు: కేజ్రీవాల్

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌ ఓ పోలీస్ ఆఫీసర్‌పై కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈడీ ఆఫీస్ నుంచి కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో ఏసీపీ ఏకే సింగ్ తనతో అనుచితంగా ప్రవర్తించారని, అతడిని తన సెక్యూరిటీ విధుల నుంచి తప్పించాలంటూ రౌస్ అవెన్యూ కోర్టుకు దరఖాస్తు అందజేశారు. కాగా గతంలో మనీశ్ సిసోడియాను మెడ పట్టుకుని తీసుకెళ్లిన పోలీస్ ఆఫీసర్ కూడా ఏకే సింగే కావడం గమనార్హం.

Similar News

News March 13, 2026

జోనల్ నుంచి రాష్ట్ర స్థాయికి ఎస్సై పోస్ట్.. అసలేంటీ వివాదం?

image

TG: విద్య, ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. SI పోస్టును జోనల్ స్థాయికి కేటాయించారు. ఏ జోన్‌కైతే ఎంపికైతారో అక్కడే సర్వీస్‌తో పాటు ప్రమోషన్లు ఉంటాయి. దీంతో ఆ జోన్‌లోని ఖాళీలను బట్టి ఒకే బ్యాచ్ SIలకు త్వరగా ప్రమోషన్లు వచ్చాయి. దీంతో వివాదం మొదలైంది. దీనికి తెరదించుతూ SI పోస్టును రాష్ట్రస్థాయికి మార్చాలని అధికారులు ప్రతిపాదించారు.

News March 13, 2026

రాష్ట్రంలో 17,992 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!

image

TG: రాష్ట్ర హోంశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో 17,992 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసి క్యాబినెట్ సబ్ కమిటీకి పంపారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అలాగే ఎస్సై పోస్టును జోనల్ నుంచి రాష్ట్ర స్థాయికి మార్చాలని సూచించారు.

News March 13, 2026

రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 పోస్టులు

image

బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 192 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్(NTC), నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్(NCVT) కలిగిన వారు ఏప్రిల్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 15ఏళ్లు పూర్తై, 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rwf.indianrailways.gov.in