News March 21, 2025
దుస్తులు మార్చుకుంటుండగా డోర్ తీశాడు: షాలినీ పాండే

ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ దక్షిణాది సినిమాలో నటిస్తున్న సమయంలో నా అనుమతి లేకుండానే ఓ డైరెక్టర్ నా క్యారవాన్ డోర్ తీశాడు. అప్పుడు నేను బట్టలు మార్చుకుంటున్నా. అతడిపై నేను గట్టిగా కేకలు వేయడంతో వెళ్లిపోయారు. డైరెక్టర్ తీరుతో నేను ఎంతో బాధపడ్డా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా షాలినీ పలు సినిమాల్లో నటించారు.
Similar News
News October 18, 2025
బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

భారతదేశపు బంగారం నిల్వల విలువ మొదటిసారిగా $100 బిలియన్ మైలురాయిని అధిగమించింది. మొత్తంగా $102 బిలియన్లు దాటినట్లు RBI డేటా పేర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇదెంతగానో బలం చేకూర్చనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం RBI విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 14.7% కి చేరింది.
News October 18, 2025
రేపే తొలి వన్డే.. ట్రోఫీతో కెప్టెన్లు

భారత్ vs ఆసీస్ వన్డే సిరీస్ రేపు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా కెప్టెన్లు గిల్, మార్ష్ ట్రోఫీ లాంచ్ చేసి ఫొటోలకు పోజులిచ్చారు. కెప్టెన్‌గా గిల్‌కిది తొలి వన్డే సిరీస్ కాగా, AUSలోని బౌన్సీ పిచ్‌లు తన సారథ్యానికి సవాలు విసరనున్నాయి. మరోవైపు అందరి దృష్టి RO-KOలపై ఉంది. వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకునేందుకు ఈ సిరీస్ వారికి కీలకం అయ్యే ఛాన్సుంది. తొలి వన్డే రేపు పెర్త్ వేదికగా జరగనుంది.
News October 18, 2025
ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

AP: ఏజెన్సీల్లోని గురుకుల విద్యార్థులను విషజ్వరాలు వణికిస్తున్నాయి. కురుపాం స్కూళ్లో 150 మందికి పైగా జాండీస్ సోకగా ఇద్దరు మరణించడం తెలిసిందే. తాజాగా సాలూరు ఇతర ప్రాంతాల్లో 2900 మందికి వైద్య పరీక్షలు చేయగా 21మంది జ్వరాలున్నట్లు తేలింది. జాండీస్, మలేరియా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. స్కూళ్లలో పారిశుధ్య లోపం, ఏళ్లతరబడి మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయకపోవడమే వీటికి కారణమని పేర్కొంటున్నారు.