News October 22, 2024

ఐదేళ్ల పాటు నకిలీ కోర్టు నడిపేశారు!

image

గుజరాత్‌లో కొంతమంది దుండగులు ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోరిస్ సామ్యుల్ క్రిస్టియన్ అనే నిందితుడు తన ముఠాతో కలిసి 2019లో ఓ ప్రభుత్వ భూమి సెటిల్మెంట్‌లో నకిలీ తీర్పు ఇచ్చేందుకు నకిలీ కోర్టును ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచీ అతడి ముఠా ఈ దందాను కొనసాగిస్తుంది. అహ్మదాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు మోరిస్ బండారం బట్టబయలైంది.

Similar News

News October 31, 2025

సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్‌ 19 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.curaj.ac.in

News October 31, 2025

చూడి పశువులు ఈనేముందు వసతి జాగ్రత్తలు

image

చూడి పశువును ఈనడానికి 15 రోజుల ముందు దూడ వేసే స్థలానికి మార్చాలి. నేలకు, మేతతొట్టెకు, పక్క గోడలకు సున్నం పూసి శుభ్రంగా ఉంచాలి. దీని వల్ల పశువులు ఈనే సమయంలో, మావి పడిపోయే సమయంలో గర్భాశయానికి రోగకారక క్రిములు చేరకుండా రక్షణ కలుగుతుంది. మేత తొట్టె నుంచి, మురుగు కాలువ వరకు నేల ఒక అంగుళం ఏటవాలుగా ఉండేట్టు చూసుకోవాలి. పశువులకు ఎండుగడ్డినే నేలపై పరిచి పరుపుగా వాడాలి. వరి పొట్టు, రంపం పొట్టు వాడొద్దు.

News October 31, 2025

‘ఓం నమఃశివాయ’ మంత్రం గొప్పదనం

image

జపం ఉద్దేశం జన్మబంధాన్ని తొలగించడం. శివ భక్తులు ఓంకారంతో కలిపిన ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపించాలి. ఈ జపానికి మాఘ, భాద్రపద మాసాలు అత్యంత శ్రేష్ఠమైనవి. జపం చేసే సాధకుడు నియమబద్ధుడై, ఓపూట మాత్రమే ఆహారం తీసుకుంటూ, తక్కువగా మాట్లాడాలి. అలాగే, మనస్సును అదుపులో ఉంచుకునే గుణాలు కలిగి ఉండాలి. ఇలాంటి నియమాలు పాటించే శివ భక్తులు కల్పాంతం వరకు శివలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. <<-se>>#SIVOHAM<<>>