News June 18, 2024
చనిపోతూ ఆరుగురి ప్రాణాలు కాపాడాడు
తమ కొడుకు చనిపోయినప్పటికీ మరో ఆరుగురిలో జీవించి ఉంటారనే ఉద్దేశంతో ముష్టిపల్లి శ్రీనివాస్ కుటుంబం అవయవదానం చేసేందుకు ముందుకొచ్చింది. అతని రెండు కిడ్నీలు, లివర్, గుండె, 2 కళ్లు దానం చేయడం ద్వారా ఆరుగురికి పునర్జన్మనిచ్చారని తెలంగాణ జీవన్‌దాన్ Xలో పోస్ట్ చేసింది. శ్రీనివాస్ ఈనెల 14న మరణించినట్లు వెల్లడించింది.
Similar News
News January 18, 2025
నేడు రాష్ట్రానికి అమిత్ షా
AP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకొని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్‌లో బస చేయనున్నారు. రేపు గన్నవరంలో సమీపంలోని NIDM సెంటర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాలను ఆయన ప్రారంభిస్తారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
News January 18, 2025
ముడా కేసులో సిద్ధ రామయ్యకు ఈడీ షాక్
ముడా మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఇతరులకు చెందిన రూ.300 కోట్ల విలువైన 142 ఆస్తులను అటాచ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని, విపక్షాలు తనపై రాజకీయ కక్షతోనే కుట్ర పన్నారని సీఎం చెబుతున్నారు.
News January 18, 2025
జనవరి 18: చరిత్రలో ఈరోజు
1881: సంఘ సంస్కర్త, భాషావేత్త నాళం కృష్ణారావు జననం
1927: ప్రముఖ సంగీత విద్వాంసుడు, దర్శకుడు సుందరం బాలచందర్ జననం
1972: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం
1975: సినీ నటి మోనికా బేడి జననం
1996: సినీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ మరణం
2003: హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ మరణం