News February 23, 2025
ఆయన రెండు దశాబ్దాలు విపక్ష నేతగా ఉండాలి: మంత్రి

AP: మాజీ సీఎం జగన్ రేపు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో మంత్రి సుభాష్ పరోక్షంగా స్పందించారు. ‘CMగా ఎలాగో ఘోరంగా విఫలమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని ప్రజా తీర్పు అందుకున్నారు. MLAగా అయినా సభా మర్యాదలు పాటిస్తూ సఫలం అవ్వాలని కోరుకుంటున్నాం. బాధ్యత గల విపక్ష నేతగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ రెండు దశాబ్దాలు మంచి విపక్ష నేతగా పేరు సంపాదించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 23, 2025
అసెంబ్లీలో వైసీపీ భాష వాడొద్దు: పవన్

AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలు, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దామన్నారు. ప్రజాగొంతును అసెంబ్లీలో వినిపిద్దామని, సభ్యులు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకోవాలని సూచించారు. వాడే భాష హుందాగా ఉండాలని, వైసీపీ భాష వాడవద్దని హితవు పలికారు.
News February 23, 2025
ఆ రోజే ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’?

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మార్చి 1న జీ తెలుగులో ప్రసారం కానుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం అదే రోజు నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కన్నడ <<15474976>>‘మ్యాక్స్’<<>> కూడా టీవీల్లో ప్రసారమైన కాసేపటికే ZEE5లోకి వచ్చేసింది. ఇదే పంథాను OTT సంస్థ కొనసాగిస్తుందని సమాచారం. కాగా థియేటర్లలో ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
News February 23, 2025
విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ

పాకిస్థాన్‌తో మ్యాచులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదారు. వన్డేల్లో ఇది ఆయనకు 51వ సెంచరీ. ఇవాళ్టి మ్యాచులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ పరుగుల వర్షం కురిపించారు.