News June 3, 2024
రోహిత్‌తో అతడే ఓపెనింగ్ చేయాలి: గవాస్కర్

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు కెప్టెన్ రోహిత్‌తో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. జైస్వాల్ ఫామ్‌లో లేనందున ఇదే సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో విరాట్ అద్భుతంగా ఆడారన్నారు. ఉత్తమ ప్లేయర్లు ఎక్కడ ఆడినా మంచి ప్రదర్శనే చేస్తారని తెలిపారు. కాగా బంగ్లాతో వార్మప్ మ్యాచులో రోహిత్‌తో సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశారు.
Similar News
News December 23, 2025
నేడు పంచముఖ హనుమంతుడిని పూజిస్తే..?

మంగళవారం నాడు పంచముఖ హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. జాతకంలోని కుజ దోష నివారణకు, రుణ బాధల నుంచి విముక్తి కోసం ఈ పూజ చేయాలంటున్నారు. ‘5 ముఖాల స్వామిని ఆరాధించడం వల్ల 5 దిశల నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాధుల నుంచి విముక్తి, శత్రువులపై విజయం సాధిస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానం లభిస్తాయి’ అంటున్నారు.
News December 23, 2025
BSF 549 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 23, 2025
హైట్‌ను పెంచే హస్తపాదాసనం

ప్రతిరోజూ హస్తపాదాసనం సాధన చెయ్యడం ఎత్తు పెరగడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రెండు కాళ్లు దగ్గరగా పెట్టి నిల్చొని గట్టిగా శ్వాస పీల్చి ముందుకు వంగాలి. చేతులు నేలపై ఆనించాలి. తలను మోకాళ్లకు తాకించాలి. మోకాళ్లను వంచకుండా ఈ భంగిమలో కాసేపు ఉండాలి. తరువాత యథాస్థానానికి రావాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి. ఈ ఆసనం రోజూ సాధన చేస్తే పూర్తిస్థాయిలో చేయడం వీలవుతుంది.


