News December 1, 2024

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు

image

కూచ్ బిహార్ ట్రోఫీలో బిహార్ బౌలర్ సుమన్ కుమార్ రికార్డ్ సృష్టించారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో అతడు ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టారు. 23వ ఓవర్‌లో తొలి వికెట్ తీసిన ఈ పేసర్ రెండో వికెట్ కోసం మరో 10 ఓవర్ల వరకు వేచి చూడాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత సుమన్ చెలరేగారు. తర్వాతి 8 వికెట్లనూ పడగొట్టారు. దీంతో రాజస్థాన్ 182 రన్స్‌కు ఆలౌటైంది. కాగా గతంలో అన్షుల్ కాంబోజ్ రంజీ ట్రోఫీలో 10 వికెట్లు తీశారు.

Similar News

News December 5, 2025

బంగారం ధరలు మరింత పైకి: WGC

image

వచ్చే ఏడాది కూడా పసిడి జోరు కొనసాగవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ప్రస్తుత స్థాయుల నుంచి 15-30% పెరగవచ్చని చెప్పింది. అమెరికా సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బ్యాంకులు బంగారాన్ని కొంటుండటం, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల ఈ ఏడాది ఇప్పటివరకు గోల్డ్ రేట్లు 53% పెరిగాయి. అయితే US దేశ వృద్ధి అంచనాలకు మించి రాణిస్తే ధరలు 5-20% దిగి రావచ్చని WGC పేర్కొంది.

News December 5, 2025

యూరియాకు ఇవి ప్రత్యామ్నాయం

image

యూరియా కొరతను అధిగమించేలా ప్రస్తుతం మార్కెట్‌లో పంటపై పిచికారీ చేసే అనేక ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. నానో యూరియా, నానో DAP, నీటిలో కలిపి పిచికారీ చేసే 19:19:19, 20:20:20, కాంప్లెక్స్ ఎరువులు, అధిక సాంద్రత కలిగిన 13-0-45(HD), ద్రవరూప నత్రజని ఎరువు వంటివి అందుబాటులో ఉన్నాయి. దుక్కిలో సిఫారసుల మేరకు కాంప్లెక్స్ ఎరువులను వేసుకొని, పైరుపై పిచికారీ చేసే ఎరువులను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

News December 5, 2025

దీపం కొండెక్కితే..?

image

దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే జలంలో నిమజ్జనం చేయాలి. వత్తులను దాచిపెట్టుకోవాలి. ప్రమిదలను శుభ్రం చేసుకొని మళ్లీ వాడొచ్చు. నిమజ్జనం సాధ్యం కాకపోతే నీళ్లలో వేయాలి. శుక్రవారం దీపారాధన చేస్తే శనివారం ఈ పరిహారాలు పాటించాలి. ఆవుకు ఆహారం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. ఈ ఉప్పు దీపాన్ని ఇంటికి ఈశాన్య దిశలో పెట్టాలి. ఇలా 11, 21 వారాలు చేస్తే శుభం కలుగుతుంది. దాచిపెట్టుకున్న వత్తులను ధూపంలో వాడుకోవచ్చు.