News March 13, 2025
21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!

భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ ఉద్దమ్ సింగ్ జలియన్‌వాలా బాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుని నేటికి 85 ఏళ్లు పూర్తయ్యాయి. 1919లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ పాలనలో బ్రిటిషర్లు దాదాపు 400 మంది పౌరులను దారుణంగా చంపారు. ఇందుకు ప్రతీకారంగా ఉద్దమ్ 1940 మార్చి 13న లండన్‌లో డయ్యర్‌ను కాల్చి చంపారు. దీంతో 1940 జులై 31న అతడిని ఉరి తీశారు. సింగ్ ధైర్యానికి Shaheed-i-Azam అనే బిరుదు వచ్చింది.
Similar News
News April 18, 2026
యురేనియం ఇచ్చే ప్రసక్తే లేదు: ఇరాన్

శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అవి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. యురేనియంను ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు <<19670282>>ట్రంప్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఈ అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు కేంద్రీకృతమయ్యాయని చెప్పారు.
News April 18, 2026
ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు.. ప్రతిపక్షాలపై పవన్ విమర్శలు

LSలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి చట్టసభల్లో మహిళా శక్తిని పెంపొందించే అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయని AP Dy.CM పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ బిల్లును LS ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను జనసేన స్వాగతించినట్టు చెప్పారు. అయితే ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేదన్నారు. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్టసభల్లో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News April 18, 2026
సర్వీస్ ఇనామ్ భూములకు విముక్తి

AP: గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ భూములకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించింది. రాష్ట్రంలో 1,36,024 ఎకరాలను ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తున్నామని, నిషేధ జాబితా 22(A) నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో వీటి క్రయ, విక్రయాలకు, రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించనుంది. అవి పట్టా భూములుగా రికార్డుల్లో ఉంటాయి.


