News November 27, 2024

అతడు మహిళలకు అసభ్యకర ఫొటోస్ పంపేవాడు: దర్శన్

image

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ పిటిషన్ సందర్భంగా కన్నడ నటుడు దర్శన్ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. ‘రేణుకాస్వామికి మహిళలంటే గౌరవం లేదు. గౌతమ్ అనే పేరుతో పవిత్ర గౌడతో పాటు మరికొందరు మహిళలకు తరచూ న్యూడ్ ఫొటోస్ పంపి వేధించేవాడు. అతడు సమాజానికి ముప్పుగా మారాడు’ అని దర్శన్ తరఫు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. కాగా రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన దర్శన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.

Similar News

News November 21, 2025

వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

image

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News November 21, 2025

పరమ పావన మాసం ‘మార్గశిరం’

image

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.

News November 21, 2025

ESIC ముంబైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

image

<>ESIC<<>> ముంబై 54 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MBBS/MD/MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: www.esic.gov.in