News January 6, 2025

ఆయన కోచ్‌గా ఉన్నప్పుడే బాగుంది: హర్భజన్

image

రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత జట్టు ప్రదర్శన బాగుందని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. గత ఆర్నెళ్లుగా టీమ్ ఇండియా పర్ఫార్మెన్స్ ఆందోళనకరంగా ఉందని తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పారు. ఇంగ్లండ్‌తో జరగబోయే మ్యాచుల్లో భారత జట్టు సత్తా చాటాల్సి ఉందని తెలిపారు. రోహిత్, కోహ్లీ ఎవరైనా ఆట కంటే ఎక్కువ కాదని, మెరుగ్గా ఆడితేనే ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డారు.

Similar News

News December 1, 2025

NINలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్‌(NIN)లో 3 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3, 2 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఎస్సీ(నర్సింగ్, న్యూట్రీషన్, డైటెటిక్స్, హోమ్ సైన్స్, పబ్లిక్ హెల్త్ న్యూట్రీషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు mmp_555@yahoo.comకు దరఖాస్తును పంపాలి. projectsninoutsourcing@gmail.comలో సీసీ పెట్టాలి. వెబ్‌సైట్: https://www.nin.res.in

News December 1, 2025

రాజ్ నిడిమోరు గురించి తెలుసా?

image

రాజ్ నిడిమోరు తిరుపతిలో (1979) జన్మించారు. SVUలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశారు. USలో ఉద్యోగం చేశారు. సినిమా కల నెరవేర్చుకునేందుకు ఫిల్మ్ మేకింగ్‌లోకి అడుగుపెట్టారు. 2002లో షాదీ.కామ్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయ్యారు. ఆ సిరీస్ సీజన్-2లో సమంత నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు సమాచారం. తాజాగా వారు ఒక్కటయ్యారు.

News December 1, 2025

వయస్సును వెనక్కి తిప్పే బొటాక్స్

image

వయసు మీద పడుతున్నా యవ్వనంగా కనిపించేలా చేయడానికి అనేక రకాల చికిత్సలున్నాయి. వాటిల్లో ఒకటే బొటాక్స్. ముఖంపై ముడతలను పోగొట్టడానికి ఇచ్చే ఒక న్యూరో టాక్సిన్‌ ప్రొటీన్‌ ఇది. దీనిని బ్యాక్టీరియం క్లోస్ట్రిడియం బొటులినమ్‌ అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. దీనిని మన కండరాల్లోకి చొప్పిస్తే చర్మంపై గీతలు, ముడతలు తగ్గి మృదువుగా కనిపిస్తుంది. సంవత్సరానికి 2-3 మూడు ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది.