News December 14, 2024
ఉద్దేశపూర్వకంగానే జైల్లో ఉంచారు: బన్నీ లాయర్లు

అల్లు అర్జున్ను రాత్రంతా జైల్లోనే ఉంచడంపై ఆయన తరఫు లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసినా జైలు అధికారులు పట్టించుకోలేదంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే బన్నీని జైల్లో ఉంచారని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని చెబుతున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లే విషయమై అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీస్లో సినీ ప్రముఖులు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 24, 2026
ట్రంప్ వెంటనే సారీ చెప్పాలి.. బ్రిటిష్ PM డిమాండ్

అఫ్గానిస్థాన్ యుద్ధంలో అమెరికా మినహా ఇతర NATO దేశాల సైనికులు సరిగా పోరాడలేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ మాటలు ‘అవమానకరం, దారుణం’ అంటూ బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ మండిపడ్డారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన 457 మంది బ్రిటన్ సైనికుల త్యాగాలను తక్కువ చేయడం తగదని, ట్రంప్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలతో బాధిత కుటుంబాలను గాయపరచడం సరికాదన్నారు.
News January 24, 2026
T-Hub స్టార్టప్స్ కోసమే.. ఆఫీసులు వద్దు: CM రేవంత్

TG: T-Hubను కేవలం స్టార్టప్ల కేంద్రంగానే కొనసాగించాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను దాంట్లోకి మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై US పర్యటన నుంచే స్పందించారు. T-Hub ఒక ఇన్నోవేషన్ సెంటర్ అని, అక్కడ ఇతర ఆఫీసులు ఉండొద్దని సూచించారు. అద్దె ఆఫీసుల కోసం ఇతర ప్రభుత్వ భవనాలను వెతకాలని, T-Hub ప్రాధాన్యాన్ని దెబ్బతీయొద్దని తెలిపారు.
News January 24, 2026
ఈ నెల 29న OTTలోకి ‘ఛాంపియన్’

యంగ్ హీరో రోషన్ నటించిన ‘ఛాంపియన్’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 29వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు Netflix ప్రకటించింది. మూవీలో రోషన్కు జోడీగా అనస్వర రాజన్ నటించారు. స్వప్న దత్ నిర్మాణంలో ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన మూవీ DEC 25న రిలీజైన విషయం తెలిసిందే. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ‘గిరగిర’ సాంగ్ ట్రెండ్ అవుతోంది.


