News October 21, 2025

మనందరి తొలి ఆర్ట్ టీచర్ ఈయనే.. ఏమంటారు?

image

మనలో చాలా మంది సృజనాత్మకతను తొలిసారి బయటకు తీసింది POGO ఛానల్‌లో వచ్చిన ‘M.A.D. with Rob’ షోనే. ఇది 90S కిడ్స్‌కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హోస్ట్ రాబ్ మనందరి తొలి ఆర్ట్ టీచర్. ఆయన వేస్ట్ నుంచి బెస్ట్ క్రాఫ్ట్స్‌ ఎలా చేయాలో చక్కగా వివరించేవారు. దాన్ని ఫాలో అయి మనమూ రూపొందిస్తే పేరెంట్స్ సంతోషించేవారు. అందుకే ఈ షో చూసేందుకు వారు ప్రోత్సహించేవారు. దీనిని మరోసారి ప్రసారం చేయాలనే డిమాండ్ నెలకొంది.

Similar News

News October 22, 2025

అర్ధరాత్రి వరకు నిద్ర పోవడం లేదా?

image

సరైన నిద్ర లేకుంటే శరీరం అధిక కేలరీల ఆహారం కోరుకుంటుందని, దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ రావొచ్చు. ఏకాగ్రత దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఉదయం నిద్ర లేచాక నీరసంగా అనిపించి రోజంతా చురుకుగా ఉండలేరు. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి.
Share it

News October 21, 2025

ఇండియాపై పాక్ ఆరోపణలు.. దీటుగా బదులిచ్చిన అఫ్గాన్

image

ఇటీవల జరిగిన సరిహద్దు ఘర్షణల్లో ఇండియా హస్తం ఉందంటూ పాక్ చేసిన ఆరోపణలపై అఫ్గాన్ దీటుగా స్పందించింది. అవి నిరాధార, ఆమోదయోగ్యంకాని ఆరోపణలని మండిపడింది. ఓ స్వతంత్ర దేశంగా భారత్‌తో బంధం కొనసాగిస్తామని అఫ్గాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్ స్పష్టంచేశారు. ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ భూభాగాలను వాడుకునేందుకు ఎన్నటికీ అనుమతివ్వబోమని చెప్పారు. పాక్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని అన్నారు.

News October 21, 2025

6 లక్షల వర్కర్ల స్థానంలో రోబోలు.. అమెజాన్ ప్లాన్!

image

ఆటోమేషన్ దిశగా అమెజాన్ అడుగులేస్తోంది. 2033 నాటికి అమెరికాలో 6 లక్షల ఉద్యోగాలను రోబోలతో ఆ సంస్థ భర్తీ చేయనున్నట్లు The New York Times నివేదిక వెల్లడించింది. కంపెనీ మొత్తం కార్యకలాపాలలో 75% ఆటోమేట్ చేసే దిశగా రోబోటిక్ టీమ్ పని చేస్తోందని చెప్పింది. 2027 నాటికి భర్తీ చేయాల్సిన 1.6 లక్షల జాబ్స్‌నూ కట్ చేయొచ్చని అంచనా వేసింది. ఆటోమేషన్‌తో 2025-2027 మధ్య $12.6B ఆదా అవుతాయని భావిస్తున్నట్లు తెలిపింది.