News July 25, 2024
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు

టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాశ్ పేరు మార్చుకున్నారు. తండ్రి పేరు నుంచి జగన్నాథ్ను ఆయన తీసుకున్నారు. ఇకపై తన పేరు ‘ఆకాశ్ జగన్నాథ్’ అని సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో ఆకాశ్ రాబోయే రోజుల్లో నూతన విజయాలు అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆంధ్రాపోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


