News August 15, 2024
పెద్దన్నగా అండగా ఉంటా.. యువతకు సీఎం రేవంత్ భరోసా

TG: అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30వేల మందికి నియామక పత్రాలు అందించామని CM రేవంత్ తెలిపారు. ‘TGPSCని ప్రక్షాళన చేసి గ్రూప్-1 ప్రిలిమినరీ, 11,062 టీచర్ పోస్టుల భర్తీకి DSC నిర్వహించాం. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మేం పరిష్కరిస్తాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. పెద్దన్నగా మీకు అండగా ఉంటా’ అని యువతకు హామీ ఇచ్చారు.
Similar News
News January 20, 2026
ఆ విషయం నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: గుడివాడ

AP: చలి కారణంగా తాను దావోస్ వెళ్లలేదని లోకేశ్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని YCP నేత గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. బ్రాండ్ ఇమేజ్‌తో కాదు బ్యాండ్ మేళంతో CBN, లోకేశ్ సమ్మిట్‌కు వెళ్లారని ఎద్దేవా చేశారు. పండుగ పేరుతో అశ్లీల నృత్యాలు చేయిస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా అని ప్రశ్నించారు. కేంద్రంలో చక్రం తిప్పుతున్నాం అని చెప్పుకునే వాళ్లు NTRకు భారతరత్న ఎందుకు తెచ్చుకోలేకపోయారని నిలదీశారు.
News January 20, 2026
ఈ ఐదుగురు మిత్రులు మీతో ఉన్నారా?

మనకు 5 రకాల స్నేహితులు తోడుగా ఉండాలి. నిత్యం దైవ లీలలను స్మరిస్తూ మనల్ని నవ్వించే ‘విదూషకుడు’, ధర్మమార్గంలో నడిపిస్తూ జీవిత పాఠాలు నేర్పే ‘మార్గదర్శి’, క్లిష్ట సమయాల్లో త్వరిత నిర్ణయాలు తీసుకునే ‘ధైర్యశాలి’ ఉండాలి. మన భక్తిలోని లోపాలను ప్రశ్నించి సరిదిద్దే ‘పృచ్ఛకుడు’, మనపై పూర్తి నమ్మకంతో దైవకార్యాల్లో అండగా నిలిచే ‘విశ్వాసి’ వంటి మిత్రులు ఉండాలి. ఇలాంటివారు మీకుంటే అది నిజంగా దైవానుగ్రహమే.
News January 20, 2026
CSLలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(<


