News April 13, 2024
26 ఏళ్లకే ఇండిపెండెంట్ MLAగా గెలిచాడు

రాజస్థాన్‌కు చెందిన రవీంద్ర సింగ్ భాటీ 26 ఏళ్లకే MLAగా గెలిచారు. షియో సెగ్మెంట్ నుంచి బలమైన BJP, కాంగ్రెస్ అభ్యర్థులను ఎదుర్కొని 4 వేల ఓట్ల తేడాతో నెగ్గారు. ప్రస్తుతం బార్మర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర MP అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తాను చదివిన వర్సిటీలో కూడా ఆయన స్వతంత్రంగా పోటీచేసి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రవీంద్ర తన పదునైన ప్రసంగాలతో ప్రజాదరణ పొందుతున్నారు.
Similar News
News April 3, 2026
ఏప్రిల్ 3: చరిత్రలో ఈరోజు

★ 1914: భారత్ తొలి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా జననం
★ 1955: సింగర్ హరిహరన్ జననం
★ 1962: సినీనటి జయప్రద జననం
★ 1973: నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం
★ 1680: మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ మరణం
★ 1943: ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ స్థాపన
News April 3, 2026
రెండు భాగాలుగా బాలయ్య-వివేక్ ఆత్రేయ సినిమా?

యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమాపై ఓ ఆసక్తికర అప్డేట్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పెద్ద కథ కావడంతో దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. దర్శకుడి నరేషన్ నచ్చడంతో బాలయ్య సైతం ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీకి ‘కురుక్షేత్రం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్.
News April 3, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


