News September 10, 2024

రూ.500 లాటరీతో రూ.2.5 కోట్లు గెలిచాడు!

image

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ప్రీతమ్ లాల్ పాత సామాన్లు కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బులతో గత 50 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్న ఆయనకు ప్రతిసారి నిరాశే ఎదురయ్యేది. ఇక లాటరీలు కొనవద్దు అనుకోగా.. భార్య చెప్పడంతో ఇదే చివరిదని రూ.500 పెట్టి కొనుగోలు చేశారు. ఇన్నిరోజులు అతని సహనాన్ని పరీక్షించిన అదృష్టం ఆ లాటరీతో ప్రీతమ్ ఇంటి తలుపు తట్టింది. పంజాబ్ స్టేట్ లాటరీలో ఆయన రూ.2.5 కోట్లు గెలుపొందారు.

Similar News

News October 18, 2025

యమ దీపం ఎలా పెట్టాలంటే..?

image

ధన త్రయోదశి నాడు వెలిగించే యమ దీపంలో నాలుగు వత్తులు, నాలుగు ముఖాలుగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఈ దీపం కోసం.. నువ్వుల నూనె/ ఆవ నూనెను ఉపయోగించాలి. దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో ఉంచాలి. కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్షుతో, కష్టాల నుంచి విముక్తి పొందాలని యమధర్మరాజును ప్రార్థించాలి. ఈ దీపదానం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నిలిచి, అకాల మరణ భయం తొలగిపోతుంది’ అని అంటున్నారు.

News October 18, 2025

BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

image

తెలంగాణలో బీసీల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లతో రాజ్యమేలుతారనుకుంటే బంద్‌‌తో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం హడావిడిగా బిల్లు రూపొందించడం, దాన్ని గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం, హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే విధించడంతో తమ ‘నోటికాడ ముద్ద’ లాగేసుకున్నారని బీసీలు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ పరిణామానికి కారణమెవరు? Comment

News October 18, 2025

అత్యంత భారీగా తగ్గిన వెండి ధరలు

image

ధన త్రయోదశి వేళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండిపై ఏకంగా రూ.13వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,910 తగ్గి రూ.1,30,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పతనమై రూ.1,19,950కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి.