News May 16, 2024
గోల్డ్ మెడల్ సాధించాడు..కానీ!
ఫెడరేషన్ కప్‌లో హరియాణా తరఫున బరిలో దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించారు. జావెలిన్‌ను 82.27m దూరం విసిరి ఛాంపియన్‌గా నిలిచారు. కానీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. 2021లో ఇదే టోర్నీలో అతను 87.80m విసిరారు. అతని వ్యక్తిగత ఉత్తమం 89.04mగా ఉంది. వీటితో పోలిస్తే తాజాగా విసిరిన దూరం తక్కువ కావడం, త్వరలో ఒలింపిక్స్ ఉండడంతో అతని ప్రదర్శనపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Similar News
News January 8, 2025
తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా?: హైకోర్టు
తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా అని బొంబాయి హైకోర్టు ప్రశ్నించింది. అలాంటివారికి తల్లి అయ్యే హక్కు లేదని చెప్పడం సరికాదని పేర్కొంది. తన కుమార్తెకు 21 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు పెళ్లి కూడా కాలేదని, మానసిక స్థితి బాగాలేదని తెలిపారు. మరోవైపు ఆమె తల్లి అయ్యేందుకు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారని వైద్యులు కోర్టుకు తెలిపారు.
News January 8, 2025
BREAKING: ఫలితాలు విడుదల
తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఫలితాలను TGPSC విడుదల చేసింది. ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను వెబ్‌సైటులో అందుబాటులో ఉంచింది. 2023 జులైలో TPBO ఉద్యోగాలకు రాత పరీక్ష జరగ్గా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <
News January 8, 2025
రేపటి నుంచి SAT20: భారత్ నుంచి ఒక్కడే
రేపటి నుంచి SAT20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. క్లాసెన్, బట్లర్, జాన్సెన్, విల్ జాక్స్, మార్క్రమ్, మిల్లర్, జాసన్ రాయ్, డుప్లెసిస్, డికాక్, పూరన్, స్టొయినిస్, రషీద్ ఖాన్, పొలార్డ్, సామ్ కరన్, సాల్ట్, లివింగ్‌స్టోన్ వంటి స్టార్లు ఆడతారు. భారత్ నుంచి దినేశ్ కార్తీక్ మాత్రమే ఈ టోర్నీలో ఆడనున్నారు. పర్ల్ రాయల్స్ తరఫున ఆయన బరిలోకి దిగుతారు.