News December 12, 2024
నన్ను గొడ్డులా చావబాదేవాడు: అతుల్ భార్య

రూ.10 లక్షల వరకట్నం కోసం తనను తీవ్రంగా వేధించారని అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా ఆరోపించారు. తనకు వచ్చిన జీతం మొత్తం సుభాష్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేవారని 2022లో పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో తెలిపారు ‘సుభాష్, ఆయన తల్లిదండ్రులు నన్ను శారీరకంగా, మానసికంగా వేధించారు. తాగొచ్చి గొడ్డును బాదినట్లు చావగొట్టేవారు. ఇదంతా చూసి తట్టుకోలేక మా నాన్న గుండెపోటుతో మరణించారు’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News January 29, 2026
విశాఖలో ముగిసిన జాతీయ జైళ్ల అధికారుల సదస్సు

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన 9వ జాతీయ కారాగార నిర్వాహకుల సదస్సు గురువారం ముగిసింది. ముగింపు వేడుకలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలు మాత్రమే కాదని, సంస్కరణ నిలయాలుగా మారాలని ఆమె ఆకాంక్షించారు. టెక్నాలజీ వినియోగం, లేబర్ కోడ్ మార్పులు, ఖైదీల పునరావాసంపై సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
News January 29, 2026
కొత్తగా ఇల్లు కడుతున్నారా? ఈ నియమం పాటించండి..

కొత్తగా గృహ నిర్మాణం చేస్తున్నవారు పునాదిని ఎత్తుగా నిర్మించుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ప్రధాన రహదారి కంటే ఇంటి అడుగు భాగం 3-5 అడుగుల ఎత్తులో ఉండాలంటున్నారు. ‘రాబోయే రోజుల్లో రోడ్లు ఎత్తు పెరిగి, వర్షపు నీరు, మురుగు నీరు ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది. వాస్తు రీత్యా కూడా ఇల్లు రోడ్డు కంటే పల్లంలో ఉండకూడదు. అందుకే దూరదృష్టితో పునాదిని ఎత్తుగా నిర్మించాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 29, 2026
రేపు రాలేను, ఎర్రవల్లి ఫాంహౌస్కు రండి: కేసీఆర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ బదులిచ్చారు. ముందే షెడ్యూల్ అయిన మున్సిపల్ ఎలక్షన్ కార్యక్రమాల వల్ల రేపు విచారణకు హాజరు కాలేనని పోలీసులకు తెలిపారు. మరో తేదీన తనను ఎర్రవల్లి ఫాంహౌస్లోనే విచారించాలని విచారణ అధికారిని కోరారు. మాజీ సీఎంగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని తెలిపారు. భవిష్యత్తులో జారీ చేసే నోటీసులను కూడా ఎర్రవల్లికే పంపాలని పేర్కొన్నారు.


