News July 10, 2024

HEAD COACH: గంభీర్ ప్రధాన డిమాండ్ ఇదేనా?

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ గంభీర్ ఎంపికయ్యారు. కోచ్ పదవికి ఎంపిక కాకముందు BCCIకి గంభీర్ ఓ షరతు విధించినట్లు తెలుస్తోంది. తనకు అసిస్టెంట్‌ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను ఎంపిక చేయాలని ఆయన డిమాండ్ చేశారట. అంతేకాకుండా మిగతా సహాయక సిబ్బంది ఎంపిక కూడా తనకే వదిలేయాలని డిమాండ్‌ చేయగా, దానిపై BCCI ఆలోచిస్తున్నట్లు టాక్. కాగా అభిషేక్ నాయర్ ఐపీఎల్‌లో కేకేఆర్‌కు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు.

Similar News

News January 17, 2026

ఇండిగో సంక్షోభం.. భారీ జరిమానా విధించిన DGCA

image

వందల <<18481260>>విమానాల రద్దు<<>>, వాయిదాలతో ప్రయాణికులను ఇండిగో ముప్పుతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో కొన్ని రోజులపాటు కొనసాగిన ఈ సంక్షోభంపై DGCA ఇవాళ చర్యలు తీసుకుంది. ఇండిగోకు రూ.22.2 కోట్ల జరిమానా విధించింది. అలాగే రూ.50 కోట్ల బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని ఆదేశించింది. రాబోయే నెలల్లో తనిఖీలు చేసి దశలవారీగా ఆ డబ్బు రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇంప్రూవ్‌మెంట్ చూపించాలని స్పష్టం చేసింది.

News January 17, 2026

రేగిపండ్లతో లాభాలెన్నో..

image

*విటమిన్ ‘సి’ వల్ల రోగనిరోధక శక్తితో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
*అధిక ఫైబర్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది
*గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా తినొచ్చు (మితంగా)
*యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి
*క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

News January 17, 2026

₹16 లక్షల కోట్లకు చేరనున్న రిటైల్ వస్త్ర వ్యాపారం

image

దేశంలో రిటైల్ వస్త్ర వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. 2029-30 నాటికి ₹16 లక్షల కోట్లకు విస్తరించనుందని ‘కేర్ ఎడ్జ్’ అంచనా వేసింది. ‘ప్రస్తుతం 9.30 లక్షల కోట్లతో 41% శాతం వాటా రిటైల్ వ్యాపారానిదే. బ్రాండెడ్ దుస్తులకు ప్రాధాన్యం పెరగడం, అంతర్జాతీయ బ్రాండ్ల ప్రవేశంతో మరో 13% పెరగనుంది. టైర్2, 3 పట్టణాల్లో ఈ కామర్స్ సహా, జుడియో, మాక్స్ ఫ్యాషన్, రిలయన్స్ యోస్టా వంటివి వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.