News July 16, 2024
ఓపెనర్లుగా హెడ్, మెక్గుర్క్.. ప్రత్యర్థులకు చుక్కలే!

ఆస్ట్రేలియా తరఫున వన్డేలు, T20ల్లో ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ ఓపెనింగ్ చేయనున్నారు. త్వరలో స్కాట్లాండ్, ఇంగ్లండ్తో జరగబోయే సిరీస్లలో వీరు మెరుపులు మెరిపించనున్నారు. మెక్గుర్క్ ఐపీఎల్ సీజన్ 17లో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. 9 ఇన్నింగ్సుల్లో 234 స్ట్రైక్ రేట్తో 330 పరుగులు బాదారు. అలాగే హెడ్ కూడా 190 స్ట్రైక్ రేట్తో 567 రన్స్ బాది ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


