News November 15, 2024
HEADLINES

* కాంగ్రెస్ విభజన రాజకీయాల్ని నమ్ముకుంది: మోదీ
* విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి: CM రేవంత్
* తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
* గత ఐదేళ్లలో పైసా పెట్టుబడి రాలేదు: CM చంద్రబాబు
* వైసీపీకి ప్రతిపక్ష హోదా మేము కాదు, ప్రజలివ్వాలి: పవన్
* ఆనాడు సభలో నా తల్లిని అవమానించారు: లోకేశ్
* ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణ రాజు ఎన్నిక
Similar News
News January 27, 2026
పొలం గట్లపై బంతి మొక్కలను పెంచితే?

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచడం వల్ల అనేక లాభాలున్నాయి. బంతి పువ్వులు బయట నుంచి వచ్చే హానికర పురుగులను ఆకర్షించి.. గట్టు పక్కన ఉన్న ప్రధాన పంటకు చీడల ముప్పును తగ్గిస్తాయి. బంతి పూలు తేనెటీగలు, ఇతర కీటకాలను ఆకర్షించడం వల్ల పరాగ సంపర్కం జరిగి పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ పువ్వులను మన సొంత అవసరాలకు వాడుకోవచ్చు, అలాగే ఎక్కువ పూలు వస్తే అమ్మి కొంత మొత్తం ఆదాయంగా పొందవచ్చు.
News January 27, 2026
రామకృష్ణ తీర్థం: వీరికి అనుమతి ఉండదు

రామకృష్ణ తీర్థానికి చేరుకోవడానికి అడవి మార్గంలో కఠినమైన ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే 10 ఏళ్లలోపు పిల్లలను, 50 ఏళ్లు పైబడిన పెద్దలను ఈ యాత్రకు అనుమతించరు. మార్గం సజావుగా ఉండదు కాబట్టి గుండె జబ్బులు, ఉబ్బసం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వెళ్లకపోవడం మంచిది. ఈ యాత్రలో ఎక్కువ గంటల పాటు నడవాల్సి ఉంటుంది. అందువల్ల శారీరక దృఢత్వం చాలా అవసరం. భద్రతా దృష్ట్యా ఈ నియమాలను పాటించడం క్షేమకరం.
News January 27, 2026
బనారస్ హిందూ వర్సిటీలో ఉద్యోగాలు

బనారస్ హిందూ యూనివర్సిటీ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి పీజీ (సోషల్ సైన్స్), NET, M.Phil/PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.47,000, రీసెర్చ్ అసిస్టెంట్‌కు రూ.37,000, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.bhu.ac.in/


