News November 16, 2024
HEADLINES
☞ AP: ఆడబిడ్డల రక్షణ బాధ్యత మాది: సీఎం చంద్రబాబు
☞ AP: జగన్ ఏ పథకాన్నీ ఆపలేదు: కన్నబాబు
☞ AP: త్వరలో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: లోకేశ్
☞ TG: సంక్రాంతి నుంచి సన్నబియ్యం: తుమ్మల
☞ TG: తెలంగాణ తిరగబడుతుంది: KTR
☞ TG: KTR, హరీశ్ ఒకే పార్టీలో ఉండరు: కాంగ్రెస్
☞ శబరిమల అయ్యప్ప దర్శనం ప్రారంభం
☞ IPL వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితా విడుదల
Similar News
News November 16, 2024
టీమ్ ఇండియాకు షాక్.. కోహ్లీకి గాయం?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందే టీమ్ ఇండియాను గాయాల బెడద వేధిస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. గాయం తీవ్రత తెలుసుకునేందుకు ఆయనను స్కానింగ్‌కు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ కూడా మోచేతి గాయాల బారిన పడ్డట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరు అందుబాటులో లేకపోయినా భారత్‌కు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.
News November 16, 2024
నవంబర్ 16: చరిత్రలో ఈరోజు
* 1966: జాతీయ పత్రికా దినోత్సవం
* 1908: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం.
* 1923: తెలుగు సినీ నటుడు కాంతారావు జననం.(ఫొటోలో)
* 1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం.
* 1973: తెలుగు, తమిళ సినీ నటి ఆమని జననం.
* 1973: భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం.
News November 16, 2024
RECORD: సౌతాఫ్రికా ‘ఘోర’ పరాజయం
T20 క్రికెట్లో సౌతాఫ్రికా అత్యంత ఘోర పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్‌లో సఫారీ జట్టును భారత్ 135 రన్స్ తేడాతో ఓడించింది. SAకు ఇదే అత్యంత భారీ ఓటమి. 2023లో ఆస్ట్రేలియా చేతిలో 111 రన్స్, 2020లోనూ ఆసీస్ చేతిలోనే 106 రన్స్ తేడాతో ఓడింది. అటు భారత్‌కు పరుగుల పరంగా 3వ అతి పెద్ద విజయం. భారత్ 2023లో NZపై 168 రన్స్, 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల విజయం సాధించింది.