News April 15, 2025

HEADLINES

image

* AP: అంబేడ్కర్ విదేశీ విద్యాదీవెన పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం: CM CBN
* TG: ‘భూభారతి’తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: CM రేవంత్
* TG: 56 SC కులాలను 3గ్రూపులుగా విభజిస్తూ సర్కార్ GO
* AP: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్
* కంచ గచ్చిబౌలి అడవులను ప్రభుత్వం బుల్డోజర్లతో ధ్వంసం చేస్తోంది: PM
* IPL: లక్నోపై CSK విజయం

Similar News

News April 16, 2025

వక్ఫ్ చట్టంపై వైసీపీ నాటకాలు: సీఎం

image

AP: సమాజంలో అశాంతి రేపి అల్లర్లు సృష్టించాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం మాట్లాడారు. వక్ఫ్ చట్టంపై వైసీపీ మూడు రకాలుగా వ్యవహరించిందని.. లోక్‌సభలో వ్యతిరేకిస్తూ, రాజ్యసభలో అనుకూలంగా ఓటేసిందని విమర్శించారు. మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలోనూ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైరయ్యారు.

News April 16, 2025

ఆ సినిమా నాకెంతో ప్రత్యేకం: రవితేజ

image

‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ సినిమా <<16027655>>రీరిలీజ్<<>> అవుతుండటంపై మాస్ మహారాజా రవితేజ ఇన్‌స్టాలో స్పెషల్ స్టోరీని పోస్ట్ చేశారు. ‘నేను చేసిన సినిమాల్లో నా ఆటోగ్రాఫ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది నా మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈనెల 18న ఈ చిత్రం మళ్లీ థియేటర్లలో విడులవుతోంది. బిగ్ స్క్రీన్‌పై ఆ మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకుంటారని ఆశిస్తున్నా’ అని ఆయన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

News April 16, 2025

జపాన్ పర్యటనకు CM రేవంత్

image

TG: CM రేవంత్ జపాన్ పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి ఈనెల 22 వరకు తన బృందంతో కలిసి టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటిస్తారు. ఈనెల 21న ఒసాకా వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభిస్తారు. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. 23న తిరిగి HYD చేరుకుంటారు.

error: Content is protected !!