News December 31, 2025

HEADLINES

image

* వైభవంగా వైకుంఠ ఏకాదశి.. కిటకిటలాడిన వెంకన్న ఆలయాలు
* తిరుమల శ్రీవారిని దర్శించుకున్న CM రేవంత్ సహా పలువురు ప్రముఖులు
* పుతిన్ నివాసంపై దాడి వార్తలు.. PM మోదీ తీవ్ర ఆందోళన
* ఏపీలో రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు
* సంక్రాంతికి HYD-VJA మధ్య టోల్ ‘ఫ్రీ’ అమలు చేయాలంటూ గడ్కరీకి కోమటిరెడ్డి లేఖ
* బనకచర్ల కంటే నల్లమలసాగరే డేంజర్: హరీశ్ రావు
* శ్రీలంక ఉమెన్స్‌తో 5 T20ల సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన IND

Similar News

News January 9, 2026

ICSILలో 50 పోస్టులకు నోటిఫికేషన్

image

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<>ICSIL<<>>) 50 కాంట్రాక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు రేపటి(JAN 10) నుంచి జనవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు జీతం రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in

News January 9, 2026

ఇవాళ నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ

image

TG: టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు, హీరోలు వెంకటేశ్, రానా, అభిరాం ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. స్థలం వివాదం కారణంగా ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్‌ను అక్రమంగా కూల్చి సామగ్రిని దొంగలించారని ఓనర్ నందకుమార్ 2024 JANలో కోర్టును ఆశ్రయించారు. దీంతో వారిపై కేసు నమోదైంది. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోడవంతో వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు అల్టిమేటం జారీ చేసింది.

News January 9, 2026

పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పెరగగా, వెండి రేట్లు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,38,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.1,27,150 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర రూ.4వేలు తగ్గి రూ.2,68,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులున్నాయి.