News June 24, 2024

HEADLINES

image

* TG: కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల BRS MLA సంజయ్ కుమార్
* TG: రేపు TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
* AP: జగన్ ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి: మంత్రి లోకేశ్
* రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
* నీట్ పేపర్ లీకేజీ స్కామ్‌పై CBI కేసు నమోదు
* పెళ్లి చేసుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా
* T20 WC సెమీస్ చేరిన ఇంగ్లండ్

Similar News

News January 2, 2026

టికెట్ కొనాల్సిందే.. ఇంద్రకీలాద్రిపై కొత్త విధానం!

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సిఫార్సుల ద్వారా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ టికెట్లు కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ భావిస్తున్నారు. ఈ మార్పు వలన ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దుర్గగుడికి సిఫార్సుల జాబితాలో దర్శనాలకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News January 2, 2026

అయ్యప్ప యోగ ముద్ర వెన్నెముకకు రక్ష

image

అయ్యప్ప స్వామి కూర్చునే స్థితి ఓ ఆసనమే కాదు! వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మార్గం కూడా! ఈ స్థితిలో కూర్చోవడం వల్ల వెన్నుపాము నిటారుగా ఉండి, మన శరీరంలోని ప్రాణశక్తి కింద నుంచి పైకి సాఫీగా ప్రవహిస్తుంది. దీనివల్ల నడుము నొప్పి దరిచేరదు. నరాల వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఈ భంగిమ మనస్సును నిలకడగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. యోగ శాస్త్రం ప్రకారం.. ఇది అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

News January 2, 2026

మహిళలపై తీవ్ర ప్రభావం

image

రోజువారీ పనుల్లో పడి మహిళలు ఆరోగ్యంలో వచ్చే మార్పులపై దృష్టి పెట్టరు. దీంతో PCOD, మొటిమలు, సంతానలేమి, బరువు పెరగడం, జుట్టురాలడం వంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, జన్యుమార్పులు, జీవనశైలి, మద్యపానం, ధూమపానం కారణంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. మెనోపాజ్ దశలో అండాల ఉత్పత్తి నిలిచిపోవడం, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిపోవడం వల్లమానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.