News March 15, 2025
HEADLINES TODAY

AP: 11 ఏళ్ల జనసేన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసింది: పవన్
* పవన్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ: నాగబాబు
* గన్నవరం నుంచి మంగళగిరికి పవన్కు హెలికాప్టరా?: వైసీపీ
TG: గ్రూప్-3 ఫలితాలు విడుదల
* తిరుమలలో మా లేఖలు అనుమతించాలి: MP రఘునందన్
* ఢిల్లీ నుంచి CM ఒక్క రూపాయీ తేలేదు: KTR
* DC కెప్టెన్గా అక్షర్ పటేల్
Similar News
News November 21, 2025
సీఎస్ పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2026 ఫిబ్రవరి వరకు విజయానంద్ సీఎస్గా కొనసాగనున్నారు. అనంతరం సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. అదే ఏడాది మేతో ఆయన పదవీకాలం కూడా ముగియనుంది.
News November 21, 2025
అపార్ట్మెంట్ల సముదాయాలకు వీధిపోటు, వీధి శూల ప్రభావం ఉంటుందా?

గేటెడ్ కమ్యూనిటీలు లేదా అపార్ట్మెంట్లలో వీధిపోటు, వీధి శూల ప్రభావం తక్కువగా ఉంటుందని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు అంటున్నారు. ‘గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా ఉండి, కాంపౌండ్ వాల్ ఉండటం వలన ఇతరుల దృష్టి తక్కువగా పడుతుంది. భవన నిర్మాణం, భద్రతా ప్రణాళికలు వీటికి రక్షణగా నిలుస్తాయి. ప్లాట్లను సమూహంగా నిర్మించడం వలన వచ్చే భద్రత వాటి ప్రతికూల ప్రభావాలను చాలా వరకు తగ్గిస్తుంది’ అని వివరించారు. <<-se>>#Vasthu<<>>
News November 21, 2025
వివేకా హత్య కేసు.. సీఐ తొలగింపు

AP: YS వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పుడు పులివెందుల సీఐగా పనిచేసిన <<17811370>>శంకరయ్యను<<>> ఉద్యోగం నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయన సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. కేసుకు సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందని అందులో పేర్కొన్నారు. ఈక్రమంలోనే పోలీస్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని శంకరయ్యను డిస్మిస్ చేసింది.


