News July 3, 2024

HEADLINES TODAY

image

☛ యూపీ: హాథ్రస్‌లో తొక్కిసలాట.. 116మంది మృతి
☛ హిందువులపై రాహుల్ వ్యాఖ్యల్ని దేశం ఎన్నటికీ క్షమించదు: PM మోదీ
☛ TGSRTCలో 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
☛ చంద్రబాబుతో భేటీకి సీఎం రేవంత్ సుముఖత
☛ డ్రగ్స్ నియంత్రణలో సినీ పరిశ్రమ కీలకంగా వ్యవహరించాలి: CM రేవంత్
☛ AP: పలు జిల్లాల కలెక్టర్ల బదిలీలు
☛ AP: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Similar News

News March 12, 2026

రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం

image

AP: రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ సహా అన్ని పథకాల అమలుకు ఫ్యామిలీ కార్డు తీసుకొస్తున్నట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు. దీనికి రేషన్ కార్డులతో సంబంధం ఉండదన్నారు. ఈ విధానంపై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కోటిన్నర BPL కుటుంబాలు ఉన్నాయని, ఆ జాబితా నుంచి రెండేళ్లలో 5L ఫ్యామిలీలు బయట పడతాయని పేర్కొన్నారు.

News March 12, 2026

ఇజ్రాయెల్‌ను నాశనం చేసి తీరతాం: ఇరాన్

image

మిడిల్ ఈస్ట్‌లో తమతో పాటు ఇజ్రాయెల్ కలిసి ఉండడం సాధ్యం కాదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సీనియర్ మిలిటరీ అడ్వైజర్ రహీమ్ సఫావీ అన్నారు. రెండింట్లో ఏదో ఒకటే ఉండాలన్నారు. కచ్చితంగా అది తామేనని.. ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామని పేర్కొన్నారు. అలాగే ట్రంప్ అత్యంత అవినీతి, మూర్ఖపు అమెరికన్ ప్రెసిడెంట్ అని విమర్శించారు.

News March 12, 2026

ఇవాళ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. అర్హతలివే

image

గుంటూరులోని ANUలో ఇవాళ AP, ఈ నెల 15న TG అభ్యర్థులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయులో ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత యువకులు అర్హులు. ఇంటర్/రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, 6 జిరాక్స్ కాపీలు, ఆధార్, 10 పాస్ పోర్టు కలర్ ఫొటోలు తీసుకువెళ్లాలి. 6AM-10AM లోపు ANUకు చేరుకోవాలి.