News February 28, 2025

ప్రజలందరికీ ఉపయోగపడే ఆరోగ్యపాలసీ: రేవంత్

image

TG: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉపయోగపడే ఆరోగ్యపాలసీని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హెల్త్, బల్క్ డ్రగ్ విషయంలో హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని చెప్పారు. కొవిడ్ సమయంలో చాలా దేశాలకు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి అయ్యాయని పేర్కొన్నారు.

Similar News

News March 1, 2025

ఇంటర్ పరీక్షలు.. సీఎస్ కీలక సూచనలు

image

TG: ఇంటర్ పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. పరీక్షల నిర్వహణపై వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చేతి గడియారంతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సీఎస్ ఆదేశించారు.

News March 1, 2025

చరిత్రలో ఈరోజు.. మార్చి 1

image

* 1901- ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభాపతి నల్లపాటి వెంకటరామయ్య జననం
* 1968- భారత మాజీ వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవి జన్మదినం
* 1969- ఇండియన్ రైల్వేస్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెట్టారు. తొలి రైలు ఢిల్లీ, కోల్‌కతా మధ్య నడిచింది
* 1986- తెలుగు సింగర్ కారుణ్య పుట్టినరోజు

News March 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!