News September 24, 2025

ఆరోగ్య సమస్యలు.. అవసరమైన విటమిన్లు

image

* అలసటగా ఉంటే విటమిన్ B12, *రోగనిరోధక శక్తి కోసం విటమిన్ C, * జుట్టు పలచబడితే బయోటిన్ (B7), * పొడి చర్మం ఉంటే విటమిన్ E, *తరచుగా జలుబు వస్తుంటే విటమిన్ D, *కండరాల తిమ్మిరి అనిపిస్తే మెగ్నీషియం + విటమిన్ D, *రాత్రి సరిగా కనిపించకపోతే విటమిన్ A, *గాయాలు నెమ్మదిగా మానితే విటమిన్ C + జింక్, *మూడ్ స్వింగ్స్ / ఆందోళనగా ఉంటే విటమిన్ B6 + మెగ్నీషియం, *కీళ్ల దృఢత్వానికి విటమిన్ D + K2. SHARE IT

Similar News

News September 24, 2025

కాగితంపై పులిలా రష్యా.. ట్రంప్ కవ్వింపు

image

ఉక్రెయిన్‌తో మూడున్నరేళ్లుగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా కాగితంపై పులిలా వ్యవహరిస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. EU సహకారంతో రష్యా నుంచి భూభాగాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, చర్యలు తీసుకునేందుకు ఉక్రెయిన్‌కు ఇదే సరైన సమయమన్నారు. నాటో దేశాలకు ఆయుధాల సరఫరాను కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.

News September 24, 2025

సెప్టెంబర్ 24: చరిత్రలో ఈ రోజు

image

1921: సినీ నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి జననం
1950: భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్ జననం
1972: సినీ దర్శకుడు శ్రీను వైట్ల జననం
2004: భారత అణు శాస్త్రవేత్త రాజా రామన్న మరణం
2007: తొలి T20I వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా(ఫొటో)
2012: సినీ నటి అశ్వని మరణం

News September 24, 2025

USA క్రికెట్ సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

image

యూఎస్ఏ అంతర్జాతీయ సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పదే పదే నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. జాతీయ స్థాయిలో గవర్నింగ్ బాడీ హోదాను పొందడంలో పురోగతి లేకపోవడం, సంస్థాగత నిర్మాణంలో వైఫల్యం, యూఎస్‌తో పాటు అంతర్జాతీయంగానూ క్రికెట్‌ను దెబ్బతీసేలా వ్యవహరించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ICC నిర్వహించే ఈవెంట్లలో యూఎస్ఏ పాల్గొనలేదు.