News October 18, 2024
Health Risk: నిలబడి పనిచేస్తున్నారా!

శారీరక శ్రమ లేదని ఆఫీసుల్లో స్టాండింగ్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వీటితోనూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రీసెర్చర్స్ అంటున్నారు. రోజుకు 2Hrs పైగా నిలబడి పనిచేస్తే వెరికోస్ వీన్స్, నరాల్లో రక్తప్రసరణ తగ్గే జబ్బులు వస్తున్నాయని హెచ్చరించారు. అందుకే మరీ ఎక్కువగా కూర్చోకుండా, నిలబడకుండా ఇంటర్వల్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒంటి కాలిమీద బరువు పెట్టొద్దని, పోస్చర్ మార్చుకోవాలని అంటున్నారు.
Similar News
News December 9, 2025
తొలి టీ20: టాస్ ఓడిన భారత్

కటక్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయాల నుంచి కోలుకున్న హార్దిక్, గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
IND: సూర్య(C), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్
SA: మార్క్రమ్(C), డికాక్, స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, జాన్సెన్, మహరాజ్, నోర్ట్జే, సిపామ్లా, ఎంగిడి
News December 9, 2025
సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్లో ₹5,39,495 కోట్ల పెట్టుబడులు

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2 రోజుల సదస్సులో ఇప్పటివరకు రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. మొదటి రోజు రూ.2,43,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేలా వివిధ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇక రెండో రోజైన మంగళవారం సాయంత్రం వరకు మరో రూ.2,96,495 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. IT, POWER, TOURISM, FOREST తదితర విభాగాల్లో ఇవి వచ్చాయి.


