News January 21, 2025
యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్య సేవలు

TG: నెట్ వర్క్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయడంతో మంత్రి రాజనర్సింహా ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. గత ఏడాది కాలంలో రూ.1,137కోట్లు చెల్లించామని, మరో 6 నెలల్లో బకాయిలన్నీ క్లియర్ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇతర సమస్యలపైనా కమిటీ ఏర్పాటు చేసి, సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో ఆరోగ్య శ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది.
Similar News
News November 19, 2025
ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్?

TG: BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించడంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 50%లోపు రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లను ఫైనల్ చేసి గెజిట్ జాబితాను ECకి అందిస్తారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. DEC 25లోగా 3 విడతల్లో ఎలక్షన్స్ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 19, 2025
బంధంలో సైలెంట్ కిల్లర్

కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారు. దీనినే స్టోన్ వాలింగ్ అంటారు. వీరు ఇతరులతో పెద్దగా మాట్లాడరు. సీరియస్‌గా మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండడమో, మధ్యలోనే వెళ్లిపోవడమో చేస్తుంటారు. కొందరు అక్కర్లేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. కొన్నిసార్లు అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు.
News November 19, 2025
హిడ్మా ఎన్‌కౌంటర్‌లో ఏపీ పోలీసుల సక్సెస్

ఛత్తీస్‌గఢ్‌లో జన్మించిన హిడ్మాకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో గట్టి పట్టు ఉండేది. చాలాసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఇతడిని అంతం చేస్తే చాలు మావోయిజం అంతం అవుతుందని పోలీసులు భావించేవారు. కొన్ని నెలలుగా వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సేఫ్ కాదని భావించిన హిడ్మా.. ఏపీవైపు వచ్చాడని తెలుస్తోంది. గత నెల నుంచే అతడిపై నిఘా వేసిన ఏపీ పోలీసులు పక్కా వ్యూహంతో హిడ్మాపై దాడి చేశారు.


