News December 13, 2024

బన్నీ క్వాష్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

image

TG: అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. తనపై నమోదైన కేసులను కొట్టేయాలని ఆయన తరఫు లాయర్లు కోర్టును కోరారు. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News December 27, 2025

H1B వీసా జాప్యాన్ని US దృష్టికి తీసుకెళ్లిన భారత్

image

H1B వీసా జారీలో ఆలస్యం, అపాయింట్‌మెంట్ల రద్దు అంశాలను US దృష్టికి తీసుకెళ్లినట్లు MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ అంశం ఆ దేశ సార్వభౌమాధికారానికి చెందినదైనా.. వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్, రీషెడ్యూలింగ్‌లో ఇబ్బందులపై వచ్చిన అనేక ఫిర్యాదుల గురించి తెలియజేశామన్నారు. వీసా ప్రాసెసింగ్ జాప్యం వల్ల పలువురి కుటుంబ జీవితానికి, వారి పిల్లల చదువుకు ఇబ్బందులు ఏర్పడినట్లు జైస్వాల్ చెప్పారు.

News December 27, 2025

T20ల్లో హర్మన్ ప్రీత్, షెఫాలీ రికార్డులు

image

ఉమెన్స్: SLతో జరిగిన 3వ T20లో IND ప్లేయర్లు పలు రికార్డులు సాధించారు. తాజా గెలుపుతో T20ల్లో అత్యధిక విజయాలు(77) అందించిన కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ నిలిచారు. తర్వాత AUS ప్లేయర్ మెగ్ లానింగ్(76) ఉన్నారు. మరోవైపు ఓ T20 మ్యాచ్‌లో అత్యధిక శాతం పరుగులు బాదిన బ్యాటర్‌గా షెఫాలీ(79*) నిలిచారు. ఆమె నిన్న SLపై జట్టు స్కోరు(115)లో 68.69% రన్స్ చేశారు. ఇప్పటి వరకు 2011లో హర్మన్ చేసిన 66.12% పరుగులే అత్యధికం.

News December 27, 2025

ఈ ఏడాది రూ.500కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే!

image

భారతీయ చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది 5 సినిమాలు ఒక్కోటి రూ.500 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. వాటిలో ఛావా, కాంతారా చాప్టర్-1, సైయారా, కూలీ, ధురంధర్ చిత్రాలున్నాయి. అటు కొన్నేళ్లుగా హిట్ మూవీలు లేక డీలా పడిన బాలీవుడ్‌కు ఫిబ్రవరిలో వచ్చిన ఛావా, ఏడాది చివర్లో ధురంధర్ సినిమాలు జోష్ నింపాయి. మరోవైపు దేశంలో ఇప్పటి వరకు రూ.1,000 కోట్లు సాధించిన మూవీలు 8 ఉండగా, తాజాగా ఆ లిస్టులో ధురంధర్ చేరింది.