News December 11, 2024
మోహన్ బాబు పిటిషన్పై హైకోర్టులో విచారణ

TG: మంచు మోహన్ బాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. తనను విచారణకు పిలుస్తూ రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే కోరుతూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ఈ పిటిషన్ను విచారిస్తున్నారు. దీంతో న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 14, 2025
మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ తనిఖీలు

AP: హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై సిట్ రైడ్స్ చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆయన ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. ఈక్రమంలో మరోసారి సిట్ తనిఖీలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
News October 14, 2025
L.C.A-643 మిరప రకం ప్రత్యేకతలు ఇవే

పచ్చిమిర్చితో పాటు ఎండు మిర్చికి కూడా అనువైన రకం L.C.A-643. ఈ మిర్చి కాయలు లేత ఆకుపచ్చరంగులో పొడవుగా 13 నుంచి 14 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. కాయలు ఎండిన తర్వాత కూడా కాస్త ముడతపడి ఆకర్షణీయమైన రంగులో ఉంటాయి. ఇది బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది. జెమిని వైరస్ను కూడా కొంత వరకు తట్టుకుంటుంది. నల్లతామర పురుగు సోకినా కొద్దిపాటి పురుగు మందులను పిచికారీ చేస్తే దీన్ని తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది.
News October 14, 2025
APPLY NOW: SBIలో 10 పోస్టులు

SBI 10 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, PGDM, PGDBM, CFA/FRM/CA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in/