News October 21, 2024

నేడు సుప్రీంలో గ్రూప్-1పై విచారణ

image

TG: గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు, అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. జీవో 29పైనే ప్రధానంగా ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరుగుతాయని, తమకు న్యాయం జరుగుతుందని పిటిషనర్లు ఆశలు పెట్టుకున్నారు. ఓ వైపు విద్యార్థులు ఆందోళనలు, మరో వైపు ప్రభుత్వం ఇవాళ్టి నుంచి పరీక్షలు నిర్వహిస్తుండటంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Similar News

News October 21, 2024

జియోకు కోటి మంది యూజర్లు గుడ్ బై!

image

రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచిన తర్వాత రిలయన్స్ జియోకు యూజర్లు షాక్ ఇచ్చారు. రెండవ త్రైమాసికంలో 1.07కోట్ల మంది జియోకు గుడ్ బై చెప్పినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే 5G సబ్ స్క్రైబర్స్ బేస్ మాత్రం 17మిలియన్లు పెరిగి 147 మిలియన్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.181.7 నుంచి రూ.195.1కి పెరిగింది. వినియోగదారుల్ని కోల్పోవడం తమ లాభాలపై పెద్దగా ప్రభావం చూపదని కంపెనీ పేర్కొంది.

News October 21, 2024

బాంబు బెదిరింపు కాల్స్: రూల్స్ మారుస్తున్న కేంద్రం

image

బెదిరింపు కాల్స్‌తో విమానాలకు అంతరాయాలు కలగకుండా కేంద్రం రూల్స్‌ మారుస్తోంది. ప్యాసింజర్, కార్గో సహా సెకండరీ లాడార్ పాయింట్ల వద్ద హ్యాండ్ బ్యాగుల చెకింగ్ ముమ్మరం చేయనుంది. మెసేజులు పెడుతున్న వారిని పట్టుకొనేందుకు VPN ప్రొవైడర్లతో కలిసి పనిచేయనుంది. SMలో ఒకే అకౌంట్ నుంచి ఎక్కువ మెసేజెస్ పెట్టి గంటల్లోనే డిలీట్ చేయడాన్ని గమనించిన సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ టీమ్స్‌ను అలర్ట్ చేసింది.

News October 21, 2024

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు.. త్వరలో నియోజకవర్గాలకు నిధులు!

image

TG: వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 1,320KM మేర మరమ్మతులు చేయాల్సి ఉండగా రూ.1,375 కోట్లు అవసరమని అంచనా వేసింది. R&B పరిధిలో 2,555KM రోడ్లు ధ్వంసం కాగా రూ.2,500 కోట్లు కావాలని తేల్చింది. నియోజకవర్గాల వారీగా ఆ నిధులను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు కేంద్ర సహకారమూ కోరనుంది.