News April 2, 2025
HCU భూములపై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అప్పటివరకు చెట్లు కొట్టేయొద్దని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. మరోవైపు విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా HCU భూముల వేలంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వారం నుంచి జేసీబీలు, పొక్లెయిన్లతో అటవీ ప్రాంతంలోని చెట్లను తొలగించి చదును చేయిస్తోంది.
Similar News
News April 3, 2025
‘HIT-3’ సినిమా క్లైమాక్స్‌లో కార్తీ?

నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేశ్ కొలను తెరకెక్కిస్తోన్న ‘HIT-3’కి సంబంధించిన క్రేజీ న్యూస్ SMలో చక్కర్లు కొడుతోంది. HIT, HIT-2 క్లైమాక్స్‌లో కొత్త హీరోను పరిచయం చేస్తూ సీక్వల్స్పై భారీ అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. HIT-3లోనూ మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ క్లైమాక్స్‌లో కనిపిస్తారని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
News April 3, 2025
మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా: మల్రెడ్డి

TG: క్యాబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని ఇబ్రహీంపట్నం MLA మల్రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో AICC అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో HYD-రంగారెడ్డి జిల్లాల నుంచి చాలామంది మంత్రులు ఉండేవారని, తనకు పదవి ఇవ్వడం ద్వారా RR జిల్లాకు పదవి దక్కినట్లు అవుతుందన్నారు. తనకు ఇవ్వకపోయినా జిల్లాలో ఏదో ఒక సామాజికవర్గానికి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
News April 3, 2025
ఆ ఫొటోగ్రాఫర్‌ను పట్టిస్తే రూ.10 లక్షలిస్తాం: కాంగ్రెస్ నేత

HCU భూములను జేసీబీలు చదును చేస్తుంటే అక్కడే ఉన్న జింకలు, నెమళ్లు పరుగులు తీసిన ఫొటోను సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే, ఇది ఏఐ ఎడిటెడ్ ఫొటో అని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఇంత గొప్ప ఫొటోను తీసిన వ్యక్తిని గుర్తించి తమకు పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డ్ ఇస్తామని సెటైరికల్ ట్వీట్ చేశారు.