News March 23, 2024
కవిత బెయిల్ పిటిషన్‌పై 26న విచారణ

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 26న వాదనలు వింటామని తెలిపింది. మరోవైపు కవిత కస్టడీని 3 రోజులు పొడిగించిన విషయం తెలిసిందే.
Similar News
News November 7, 2025
ప్రచారం తప్ప బాబు చేసిందేమీ లేదు: కన్నబాబు

AP: డేటా ఆధారిత పాలన అంటూ ప్రచారమే తప్ప CM CBN చేసిందేమీ లేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ‘500 వాట్సాప్ సేవల ద్వారా ఆన్లైన్లోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. మరి లోకేశ్ ప్రజాదర్బార్‌కు 4వేల అర్జీలు ఎందుకు వచ్చాయి? ప్రతిసారీ ఓ కొత్తపదంతో పబ్లిసిటీ చేసుకుంటూ మోసగించడం చంద్రబాబుకు అలవాటు’ అని విమర్శించారు. సచివాలయం వంటి వ్యవస్థలను తెచ్చి జగన్ చరిత్రలో నిలిచారన్నారు.
News November 7, 2025
సోషల్ జస్టిస్& ఎంపవర్మెంట్లో 49 ఉద్యోగాలు

<
News November 7, 2025
జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.


