News May 24, 2024

కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు.

Similar News

News December 3, 2025

ఓపెన్ కాని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌‌

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఓపెన్ చేస్తే గేమింగ్ సైట్‌కు రీడైరెక్ట్ అవుతోందని అధికారులు వెల్లడించారు. సమస్యపై ఐటీ నిపుణులు పని చేస్తున్నారు. పూర్తిస్థాయి పునరుద్ధరణకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని సైబర్ క్రైం డీసీపీ సుధీంద్ర తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News December 3, 2025

నాది కథను మలుపు తిప్పే రోల్: సంయుక్త

image

‘అఖండ-2’ అభిమానుల అంచనాలకు మించి ఉండబోతుందని హీరోయిన్ సంయుక్త మేనన్ అన్నారు. చిత్రంలో తన పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటుందని, కథను మలుపు తిప్పే రోల్ అని చెప్పారు. ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు షెడ్యూల్ బిజీగా ఉన్నా డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వయంభు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అఖండ-2 ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.

News December 3, 2025

బంధం బలంగా ఉండాలంటే ఆర్థిక భద్రత ఉండాల్సిందే!

image

మానవ సంబంధాల బలోపేతానికి ఆర్థిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే అవి మరింత పటిష్టంగా ఉంటాయని సైకాలజీ టుడే, యూగోవ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం లేకపోతే చాలా వరకు సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.