News March 26, 2024
కవిత పిటిషన్పై నేడు విచారణ

లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారణ జరపనుంది. కవితకు కోర్టు విధించిన కస్టడీ సైతం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సీబీఐ కోర్టులో ఆమెను ఈడీ హాజరుపరచనుంది. కస్టడీని మరో 4రోజులపాటు పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది.
Similar News
News October 23, 2025
పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

TG: టెన్త్ ఫైనల్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు తేదీలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రకటించింది. OCT 30-NOV 13లోపు HMలకు ఫీజు చెల్లించాలని తెలిపింది. వాళ్లు ఆన్లైన్లో NOV 14లోపు ఫీజు చెల్లించాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు DEOలకు అందించాలని పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ.200తో DEC 2-11 వరకు, రూ.500 లేట్ ఫీజ్తో DEC 15-29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
News October 23, 2025
విశాఖ గ్రోత్ హబ్ పనులు మరింత వేగవంతం: CS

AP: విశాఖ గ్రోత్ హబ్, పూర్వోదయ పథకాలపై నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం సచివాలయంలో CS విజయానంద్తో భేటీ అయ్యారు. ఏపీలో ఓడరేవులున్నా ఒక కంటైనర్ మెగా పోర్టు అవసరముందని ఆయన సూచించారు. పూర్వోదయ స్కీమ్తో తీరప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. VSP గ్రోత్ హబ్ పనుల వేగవంతానికి ప్రత్యేకంగా ఇన్ఛార్జిని నియమించనున్నామని CS చెప్పారు. కేంద్రం నుంచి తగినన్ని నిధులు వచ్చేలా చూడాలని సీఈఓను కోరారు.
News October 23, 2025
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం!

డొమిస్టిక్ విమానాల్లో పవర్ బ్యాంకులను నిషేధించే విషయాన్ని DGCA పరిశీలిస్తోంది. ఇటీవల ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంకు నుంచి మంటలు చెలరేగగా సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో వాటిని నిషేధించడం లేక తక్కువ సామర్థ్యం ఉన్నవాటిని అనుమతించడంపై పరిశీలన చేస్తోంది. త్వరలోనే మార్గదర్శకాలు ఇచ్చే అవకాశముంది. అటు పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో పవర్ బ్యాంకుల వినియోగంపై నిషేధం ఉంది.