News July 5, 2024

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 17కు వాయిదా

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ సాగింది. వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. దర్యాప్తు ముసుగులో సీబీఐ తనను వేధిస్తోందని కేజ్రీవాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు.

Similar News

News February 1, 2026

ట్యాక్స్ మిస్టేక్స్.. శిక్షల నుంచి రిలీఫ్!

image

బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు కొన్ని విషయాల్లో ఊరట కల్పించారు. అప్పీల్‌కు ముందు కట్టాల్సిన ప్రీపేమెంట్‌ను 20% నుంచి 10%కి తగ్గించారు. రీఅసెస్‌మెంట్ మొదలైనా 10% అదనపు పన్నుతో రిటర్న్స్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ₹20 లక్షల లోపు విదేశీ ఆస్తులను వెల్లడించకపోయినా జైలు శిక్ష ఉండదు. అసెస్‌మెంట్, పెనాల్టీలకు ఒకే ఆర్డర్ వస్తుంది. తప్పుగా రిపోర్ట్ చేసినా 100% అదనపు ట్యాక్స్ కడితే శిక్షలు ఉండవు.

News February 1, 2026

దేశం అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేలా బడ్జెట్: CBN

image

AP: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా ఎదిగేందుకు ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ఎంతో దోహదపడుతుందని CM CBN అభిప్రాయపడ్డారు. ‘ప్రజలు కోరుకొనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీని ఇది రిఫ్లెక్ట్ చేస్తోంది. రైతులు మహిళలు, యువతకు ప్రాధాన్యమిచ్చారు. మాన్యుఫ్యాక్చరింగ్, MSMEలకు అధిక ప్రోత్సాహకాలున్నాయి. హైస్పీడ్ రైళ్లు, రేర్ ఎర్త్ కారిడార్ల వల్ల APకి మేలు. బడ్జెట్‌ను తెచ్చిన PMకు అభినందనలు’ అని పేర్కొన్నారు.

News February 1, 2026

కేంద్ర బడ్జెట్ భేష్: రామ్మోహన్, లోకేశ్

image

కేంద్ర బడ్జెట్‌లో దేశాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, రైతులు, యువతకు ప్రాధాన్యం ఇచ్చారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విదేశీ యాత్రలపై పన్ను తగ్గింపుతో విమానయాన రంగానికి ఊతం లభిస్తుందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ఏపీకి గణనీయమైన మేలు జరుగుతుందని మంత్రి లోకేశ్ తెలిపారు. క్రిటికల్ మినరల్స్ కారిడార్, హైస్పీడ్ రైలు అనుసంధానం, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ప్రోత్సాహం ఇస్తుందన్నారు.