News December 31, 2024

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ

image

TG: ఫార్ములా-ఈ రేస్‌ విషయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని KTRదాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది. ఇక ఆయనకు ఊరటనిస్తూ అరెస్టు చేయొద్దని ఇచ్చిన గడువు సైతం నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఆ ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పును అనుసరించి కేటీఆర్ అరెస్ట్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో నేటి విచారణ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Similar News

News January 3, 2025

2097 స్కూళ్లలో విద్యార్థులు లేరు!

image

TG: దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ఏకంగా 2097 స్కూళ్లలో పిల్లలే లేరని డీఐఎస్ఎఫ్ఏ విడుదల చేసిన నివేదిక(2023-2024) తేల్చిచెప్పింది. పశ్చిమ బెంగాల్(3254), రాజస్థాన్(2187) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లేని పాఠశాలలు 12,954 ఉండగా వాటిలో తెలంగాణలోనే 2వేల పైచిలుకు ఉండటం ఆందోళనకరం.

News January 3, 2025

ఈ నెల 28 నుంచి నాగోబా జాతర

image

TG: రాష్ట్రంలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత ఆ స్థాయిలో జరిగే కెస్లాపూర్ నాగోబా జాతర ఉత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఆలయంలో 150మంది ఆదివాసీ యువత రక్తదానం చేసి జాతరకు అంకురార్పణ చేశారు. నాగోబా జాతరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా గిరిజనులు తరలిరానున్నారు.

News January 3, 2025

దీపాదాస్ మున్షీని మార్చనున్న AICC?

image

TG: రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌‌చార్జి దీపాదాస్ మున్షీపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా ఉందా? ఆమెను తప్పించాలని భావిస్తోందా? గాంధీభవన్‌లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, వ్యవహరించే తీరు బాగాలేదని పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించి మరొకరికి ఆ బాధ్యతల్ని అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.