News February 10, 2025

పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై విచారణ వాయిదా

image

TG: ఫిరాయింపు <<15413173>>ఎమ్మెల్యేలపై<<>> అనర్హత వేటు వేయాలని KTR‌తో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఒకరు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది వాదించారు. అనంతరం విచారణను ఈ నెల 18కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

Similar News

News March 25, 2026

గుడ్ న్యూస్: PNG వినియోగిస్తే ₹2400 సబ్సిడీ

image

AP: PNG వాడకాన్ని పెంచేందుకు ఏడాదికి ₹2,400 సబ్సిడీ ఇచ్చేలా DBT పథకాన్ని GOVT ప్రవేశపెట్టనుందని CS సాయిప్రసాద్ వెల్లడించారు. సెక్రటేరియట్లో SLUCC భేటీ నిర్వహించారు. ‘LPGపై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నాం. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనుమతులు సరళం చేస్తున్నాం. జిల్లాకు 10,000 PNG కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. వాణిజ్య, పరిశ్రమలకూ విస్తరిస్తాం. కంపెనీలూ సహకరించాలి’ అని పేర్కొన్నారు.

News March 25, 2026

యుద్ధం.. కొనసాగుతున్న ఆల్ పార్టీ మీటింగ్

image

పశ్చిమాసియా యుద్ధంపై కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ అధ్యక్షతన పార్లమెంట్ భవనంలో ఆల్ పార్టీ మీటింగ్ కొనసాగుతోంది. INC, BJD, SP, CPM తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ భారత్‌పై యుద్ధ ప్రభావాన్ని వివరించారు. ప్రతిపక్ష నేతలు లేవనెత్తిన సందేహాలకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమాధానాలిస్తున్నారు. ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఈ పార్టీ మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది.

News March 25, 2026

రామ్ చరణ్‌కు గాయం.. స్పందించిన ‘పెద్ది’ టీమ్

image

పెద్ది సినిమా షూటింగ్‌లో హీరో రామ్ చరణ్‌కు గాయమైందనే వార్తలపై మేకర్స్ స్పందించారు. ‘సెట్స్‌లో రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయమైంది. చిన్న హెల్త్ ప్రొసీజర్ జరిగింది. ఇప్పుడు ఆయన క్షేమంగానే ఉన్నారు. రేపు షూటింగ్‌కు హాజరవుతారు. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవు’ అని పెద్ది టీమ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అంతా కంట్రోల్‌లోనే ఉందని, ఆందోళన అవసరం లేదని తెలిపింది.