News September 22, 2025
ప్రభాకర్‌రావు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, మాజీ IPS ప్రభాకర్‌రావు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు OCT 8కి వాయిదా వేసింది. ప్రభాకర్‌రావు సిట్ దర్యాప్తుకు సహకరించడం లేదని, జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో విచారణకు సహకరించాలని కోర్టు ప్రభాకర్‌రావును ఆదేశించింది. 2 వారాల గడువు కావాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరడంతో విచారణ వాయిదా వేసింది.
Similar News
News September 22, 2025
అందంగా.. ఆపదలో రక్షణగా!

పనుల కోసం బయటికెళ్లే యువతులు, మహిళల స్వీయ రక్షణ కోసం కొత్త తరహా వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. క్యాట్ ఇయర్ కీచైన్లు లేదా కిట్టి నకిల్స్ లేదా సెల్ఫ్ డిఫెన్స్ కీ చైన్ల పేరుతో ఆన్‌లైన్‌లో లభిస్తాయి. అందంగా ఉండే వీటిని కార్, స్కూటీ కీలకు, బ్యాగ్‌లు, పర్సులకు పెట్టుకోవచ్చు. అత్యవసర సమయాల్లో వీటి రంధ్రాల్లో వేళ్లని పెట్టి గ్రిప్ తెచ్చుకుని అవతలి వ్యక్తిని ప్రతిఘటించవచ్చు.
#ShareIt
News September 22, 2025
‘విజయవాడ ఉత్సవ్’కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

AP: నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న విజయవాడ <<17789445>>ఉత్సవ్‌కు<<>> సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దుర్గ గుడి భూముల్లో వాణిజ్య కార్యకలాపాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. లీజ్‌కు తీసుకున్న వారికి, ఆలయానికి సమస్య లేనప్పుడు మూడో వ్యక్తికి అభ్యంతరమేంటని అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.
News September 22, 2025
మహిళా సైంటిస్టులకు ఓ పథకం

ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తల కోసం కేంద్ర ప్రభుత్వం ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (WISE-KIRAN) పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మూడేళ్లపాటు నెలకు రూ.50 వేల గౌరవవేతనం, HRA సదుపాయాలు కల్పించి, వారి ప్రాజెక్టు కోసం రూ.30 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. పీజీ పూర్తిచేసి, 27-60 ఏళ్లున్న మహిళలు అర్హులు. రెగ్యులర్ ఉద్యోగం చేస్తున్న మహిళలకు ఈ పథకం వర్తించదు.